
నందపూర్‌పై కాల వైశాఖి ప్రభావం
కొరాపుట్: కొరాపుట్ జిల్లా నందపూర్ సమితిపై కాలవైశాఖి ప్రకోపం చూపించింది. ఈదురు గాలులతో భారీ వర్షాలు పడడంతో జన జీవనం అస్తవ్యస్తమైంది. సిమిలిగుడ రహదారుల మద్య భారీ వృక్షాలు కూలడంతో రాకపోకల స్తంభించాయి.నందపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో లమ్తాపుట్ సమితి ఉర్దిగుడ గ్రామంలో నవీన్ హంతాల్ ఇంటి పై భారీ వృక్షం పడింది. త్రుటిలో కుటుంబీకులు ప్రాణాలతో బయటపడ్డారు. తహసిల్దార్ దివాకర్ బాగ్, ఫైర్ స్టేషన్ ఒఐసీ చిత్రరంజన్ పంజియాలు సహయ సహకారాలు, పునరుద్ధరణ కార్యక్రమాల్ల్లో పాల్గొన్నారు.

నందపూర్‌పై కాల వైశాఖి ప్రభావం