ఎక్కడో ఊరవతల ఓ మర్రి చెట్టు.. ఎండన పడి తిరిగే వారిని కా
●విశాలమైన ప్రాంగణం
మాది గండ్రేడు. శివారు గ్రామం. నాగావళి నది ఒడ్డున ఉంది. నది నుంచి వచ్చే చల్లని గాలి మర్రిచెట్టు కిందకు వచ్చి మరింత కూల్‌గా మారిపోతుంది. దీంతో పెద్దలు ఇక్కడే నిద్రపోయేందుకు, సేద దీరేందుకు వస్తుంటారు. చిన్నపిల్లలు ఆడుకునేందుకు అనువుగా చెట్టు నీడ ఉంది. ఈ చెట్టు మా గ్రామానికి వరం. – చింతాడ సూర్యారావు,
గండ్రేడు, పొందూరు మండలం
●ఎండ నుంచి ఉపశమనం
మాది మలకాం గ్రామం. చి న్న పల్లెటూరు. వేసవి కాలం వచ్చిందంటే గ్రామంలోని ప్రజలు ఈ మర్రి చెట్టుకిందకే కూర్చునేందుకు వస్తుంటారు. ఇక్కడే సేద దీరుతుంటారు. మర్రిచెట్టు వయస్సు సుమారు 200 ఏళ్లు ఉంటుంది. బయట నుంచి వచ్చేవారంతా కచ్చితంగా ఇక్కడ కూర్చొని ఎండ నుంచి ఉపశమనం పొందుతున్నారు.
– జాడ అసిరినాయుడు, మలకాం,
పొందూరు మండలం
● పచ్చని చెట్లే వేసవి విడిదులు
● పల్లెటూళ్లలో వృక్షాల కిందనే
సేద దీరుతున్న ప్రజలు
పొందూరు:
పల్లెటూరు.. సందె వేళ.. మర్రి చెట్టు కింద మకాం.. కాసిన్ని కబుర్లు.. కావాల్సినంత చల్లని గాలి. అంతే వేసవి ఇట్టే గడిచిపోతుంది. చుట్టూ ఎండ తాండవం చేస్తున్నా చెట్టు నీడలో మాత్రం ఏసీ పెట్టినట్టే చల్లటి గాలి వీస్తుంది. అదే ఇప్పుడు పల్లెవాసులను రక్షిస్తోంది. పొందూరు మండలంలోని దళ్లవలస, కోటిపల్లి, మజ్జిలిపేట, గండ్రేడు, మలకాం, వీఆర్ గూడెం గ్రామాల్లో పెద్ద మర్రి చెట్లు వేసవి విడిదులుగా దర్శనమిస్తున్నాయి. ఈ చెట్లు సుమారు 60 ఏళ్ల నుంచి 200 ఏళ్ల వయస్సు ఉన్నవి. విశాలంగా వ్యాపించిన ఊడలతో నీడ అల్లుకుంటుంది. దీంతో ఎండకు దొరకకుండా పిల్లలు, పెద్దలు వాటి కిందనే సేద దీరుతున్నారు. ఽమధ్యాహ్న సమయాల్లో చెట్ల కిందకు వచ్చి ముచ్చటించుకునేవారు కొందరు, నిద్రపోయే వారు మరికొందరు, ఆడుకునే పిల్లలు, వలస కూలీలు అక్కడే ఉంటున్నారు.