
అన్నదమ్ములకు 560 మార్కులు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి ఎం.వి.79 పోలీస్ స్టేషన్ పరిధిలో గల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న అన్నదమ్ములు డానీ ఎల్.లెంక, డోంబుర్ లెంకకు శనివారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 600 మార్కులకు 560 మార్కులు వచ్చాయి. అన్నదమ్ములను ఉపాధ్యాయులు అభినందించారు. కుమారుల విజయం పట్ల తండ్రి మోహన్ లెంక ఆనందం వ్యక్తం చేశారు.
టీచర్లకు ఆర్జిత సెలవులు
మంజూరుచేయాలి
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇటీవల వెలువడిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వేసవి సెలవుల్లో సైతం హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లి స్వచ్ఛందంగా పనిచేస్తున్న నేపథ్యంలో వారందరికీ ఆర్జిత సెలవులు మంజూరుచేయాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బి.రవి, ప్రధాన కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి విజ్ఞిప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 వరకు పనిచేయాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ఇవ్వడం సరికాదన్నారు. విద్యార్థుల మానసిక స్థితి, మండే ఎండలు, మరోవైపు ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విద్యాశాఖ మార్గదర్శకాలు ప్రతిబంధకంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.
నాటుసారా స్థావరాలపై
విస్తృత దాడులు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లావ్యాప్తంగా నాటుసారా స్థావరాలెక్కడ ఉన్నా విస్తృతంగా దాడులు జరిపి అరికట్టాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ (డీసీ) దోసకాయల శ్రీకాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం రాత్రి జిల్లాలో గల స్టేషన్ ఆఫీసర్స్, ఇన్‌స్పెక్ట ర్లు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లతో 80 అడుగుల రో డ్డు సమీప ఎకై ్సజ్ కార్యాలయంలో డీసీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 110 సారా గుర్తింపు గ్రామాలను సారా రహిత గ్రామాలుగా మార్చాలన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 212 ఐడీ కేసులు నమోదై 162 మందిని అరెస్టు చేసి 2231 లీటర్ల సారా, ఏడు వాహనాలను స్వాధీనపర్చుకున్నామన్నారు. 6735 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశామన్నారు. అక్రమంగా మద్యం విక్రయించేవారిపై 874 కేసులు నమోదు చేసి అంతేమందిని అరెస్టు చేశామని తెలిపారు. సమావేశంలో సంబంధిత శాఖ అసిస్టెంట్ కమిషనర్ పి.రామచంద్రరావు, జిల్లా అధికారి తిరుపతినాయుడు, అధికారులు పాల్గొన్నారు.
ఎన్‌సీఈఆర్‌టీ అవార్డుకు ప్రాజెక్టు ఎంపిక
కంచిలి: మండలంలోని చొట్రాయిపురం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, గణిత అవధాని మడ్డు తిరుపతిరావు రూపొందించిన గణిత ప్రాజెక్టు జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ(ఎన్‌సీఈఆర్‌టీ)వారు నిర్వహించిన అవార్డుకు ఎంపికై ంది. ఈ మేరకు ఆయనకు ఎన్‌సీఈఆర్‌టీ నుంచి సమాచారం వచ్చిందని ఆయన శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్‌సీఈఆర్‌టీ వారు జనవ రి 13న జాతీయ గణిత విద్యా సమావేశాల నిర్వహణ సందర్భంగా దేశవ్యాప్తంగా గణిత ప్రాజెక్టులను ఆహ్వానించారు. అందులో ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ‘గణిత ప్రాథమిక కార్యకలాపాల సన్నాహక దశలో విద్యార్థుల పనితీరు అంచనా వేయటానికి బోర్డు గేమ్ ప్రయోగం’ అనే ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. దేశవ్యాప్తంగా 105 ప్రాజెక్టులను ఎంపిక చేయగా.. అందులో మన రాష్ట్రం నుంచి 4 మాత్రమే ఉన్నాయి. అందులో తిరుపతిరావు ప్రాజెక్టు చోటు సంపాదించుకోవడం విశేషం.
శ్రామికులే దేశానికి వెన్నెముక
శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రామికులే దేశానికి వెన్నెముక అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం.శ్రీధర్ అన్నారు. స్థానిక న్యాయ సేవా సదన్‌లో శనివారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అసంఘటిత రంగ కార్మికులకు అవసరమైన చట్టాలు, ప్రభుత్వ పథకాలపై వివరించి, న్యాయ సహా యం అందించాల్సిన విధానాలను తెలియజేశారు. కార్మికులు తమ చెమటతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని ఆయన అన్నారు. 1886 మే 1న అమెరికాలో ఎనిమిది గంటల పనిది నం కోసం కార్మికులు చేపట్టిన ఉద్యమాన్ని, షికాగోలో హే మార్కెట్ కాల్పులను గుర్తుచేశారు. ఈ చరిత్రను యువతకి తెలియజేసి కా ర్మికుల హక్కులను గుర్తించాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాది జి.ఇందిరా ప్రసాద్, డి ప్యూటీ లేబర్ కమిషనర్ కె.అజయ్ కార్తికేయ, తదితరులు పాల్గొన్నారు.

అన్నదమ్ములకు 560 మార్కులు

అన్నదమ్ములకు 560 మార్కులు