
11 నుంచి సిమిలిగుడ అగ్ని గంగమ్మ పండగలు
కొరాపుట్: సిమిలిగుడలో అగ్ని గంగమ్మ పండగలు 11వ తేదీ నుంచి జరపాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది. శుక్రవారం కొరాపుట్ జిల్లా సిమిలిగుడ పట్టణంలోని అగ్ని గంగమ్మ దేవాలయ ప్రాంగణంలో తేదీ ఖరారు మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో సభ్యులందరూ సామూహికంగా మే 11 నుంచి 20వ తేదీ వరకు పండగలు నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం మచ్చో, మాజీ ఎమ్మెల్యే రఘరాం పొడా ల్, సునాబెడా మున్సిపల్ చైర్మన్ రాజేంద్రకుమార్ పాత్రో, సునాబెడా ఎస్‌డీపీఓ సుమిత్ర జెన్న తదితరులు పాల్గొన్నారు.