
గజపతిలో ఆరోగ్య సంక్షేమశాఖ కమిషన్ పర్యటన
పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహనా బ్లాక్‌లో రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్, కార్యదర్శి ఎస్.అస్వతీ మంగళవారం పర్యటించారు. ప్రభుత్వ ఆస్పత్రులు, వర్కింగ్ వుమెన్స్ హోస్టళ్లను తనిఖీ చేపట్టారు. ఆమె వెంట జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్, ఒడిశా జీవనోపాదుల శాఖ డి.పి.ఎం టిమోన్ బోరా, మోహనా బీడీఓ రాజీవ్ దాస్, సబ్ కలెక్టర్ అనుప్ పండా తదితరులు ఉన్నారు.
మోహనా ప్రభుత్వ ఆస్పత్రిలో అందజేస్తున్న ఉచిత మందులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాతీయ హెల్త్ మిషన్ పథకాలు అమలుపై ఆరా తీశారు.