డ్రైవర్‌కు గుండెపోటు! | - | Sakshi
Sakshi News home page

డ్రైవర్‌కు గుండెపోటు!

Apr 30 2025 5:11 AM | Updated on Apr 30 2025 5:11 AM

డ్రైవ

డ్రైవర్‌కు గుండెపోటు!

అదుపుతప్పి గుంతలోకి దూసుకెళ్లిన బస్‌

కొరాపుట్‌: ప్రభుత్వ లక్ష్మీ బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న గుంతలోకి దూసుకుపోయింది. అదృష్టవశాత్తు ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. ఈ సంఘటన మంగళవారం కొరాపుట్‌ జిల్లా గొడపొదర్‌ వద్ద చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు జయపూర్‌ వైపు వెళ్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అగ్ని ప్రమాదంలో గృహోపకరణాలు దగ్ధం

రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి అంబొదళ పంచాయతీలోని నువాపడ గ్రామానికి చెందిన విలాస్‌ కొరకొరియా ఇంట్లో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో లక్షలాది రూపాయల విలువైన టీవీ, ఫ్రిడ్జ్‌, బీరువ తదితర వస్తువులు దగ్ధమయ్యాయి. కుటుంబంతో కలిసి విలాస్‌ సోమవారం తమ బంధువుల ఇంటికి వెళ్లాడు. అయితే ఇంట్లో దట్టమైన పొగ బయటకు వస్తుండటంతో ఇరుగుపొరుగు వారు చూసి అగ్నిమాపక కేంద్రం సిబ్బందికి సమాచారం అందించారు. అయితే సిబ్బంది వచ్చేసమయానికే గృహోపకరణాలన్నీ బూడిదయ్యాయి. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం సంభవించి ఉండవచ్చునని భావిస్తున్నారు.

అంబొదళలో జగన్నాథుని విగ్రహ ప్రతిష్ట

రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి అంబొదళలో జగన్నాధ మందిరంలో జగన్నాథుని కొత్త విగ్రహ ప్రతిష్టోత్సవాలు సొమ,మంగళవారాల్లొ అత్యంత వైభవంగా జరిగాయి. సంప్రదాయ పద్ధతిలో స్వామి వారి పూజా కార్యక్రమాలను నిర్వహించి జగన్నాథుని కొత్తగా రూపొందించిన విగ్రహాన్ని ప్రతిష్టించారు. జగన్నాథ మందిరం నిర్వాహక కమిటీ అధ్యక్షులు చంద్రశేఖర్‌ జోషి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. విగ్రహ ప్రతిష్టోత్సవాలకు పరిసర ప్రాంతాలకు చెందిన వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. స్వామి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రెండు నెలల కిందట స్వామి విగ్రహం కాలిపోగా.. కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించారు.

కళాకారులకు సన్మానం

జయపురం: కొరాపుట్‌ జిల్లా ధమంజోడిలో పది రోజులు నిర్వహించిన పంచపటమాలి 19వ రాష్ట్రస్థాయి నాటక పోటీలు మంగళవారంతో ముగిశాయి. నాటక పోటీలలో జయపురం కళాకారులు ‘జీవన ఎకో నాటక( జీవితం ఒక నాటకం)’అనే నాటకాన్ని ప్రదర్శించి పలు బహుమతులు అందుకున్నారు. నాటక రచయిత జగదీస్‌ అధికారి, అభినేత్రి విజయలక్ష్మీ పాణిగ్రహి, నటులు బిఘ్నరాజ్‌ ఆచార్య, బాలనటుడు నివేదన పాణిగ్రహి, ముఖ్యఅతిథి నటులు నిరంజన్‌ సామల్‌లను ఈ సందర్భంగా నిర్వహకులు సత్కరించి గౌరవించారు. ఈ నాటకానికి నిరంజన్‌ పాణిగ్రహి దర్శకత్వం వహించగా జి.మహేష్‌ సంగీతం సమకూర్చారు.

డ్రైవర్‌కు గుండెపోటు! 1
1/3

డ్రైవర్‌కు గుండెపోటు!

డ్రైవర్‌కు గుండెపోటు! 2
2/3

డ్రైవర్‌కు గుండెపోటు!

డ్రైవర్‌కు గుండెపోటు! 3
3/3

డ్రైవర్‌కు గుండెపోటు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement