
ఓఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన
రాయగడ: స్థానిక కొత్తస్టాండు వద్ద గల ఓఎస్‌ఆర్టీసీ కార్యాలయం ఎదుట సోమవారం ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. గత 38 రోజులుగా ఓఎస్‌ఆర్టీసీలో పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లకు ప్రభుత్వం జీతాలు చెల్లించడం లేదన్నారు. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తు డ్రైవర్లు, కండక్టర్లతోపాటు వారి కుటుంబ సభ్యులు ఆందోళన లో పాల్గొన్నారు. జీతభత్యాలు చెల్లించకపొవడంతోపాటు అసలు పనులు కల్పిస్తారో, లేదో తెలియని అనిశ్చిత పరిస్థితి నెలకొందని వారంతా ఆరోపించా రు. రాయగడ ఓఎస్‌ఆర్టీసీ డిపో పరిధిలో రాయగ డ, కొరాపుట్ జిల్లాల ప్రయాణీకులకు బస్సు సేవ లు అందిస్తుండేవి. అత్యంత పాత బడిన బస్సుల ను నమామాత్రంగా నడిపిస్తున్న ప్రభుత్వం వాటి ఆలనాపాలనను పూర్తిగా మరిచిపోయింది. దీంతో బస్సుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. గతకొద్ది రోజుల క్రితం డిపోలో నడుస్తున్న పాత బస్సులు కండీషన్ సరిగా లేకపోవడంతో పాటు ఫిట్‌నెస్ లేవని ఆర్టీఓ అధికారి బస్సులను రద్దు చేశారు. అప్పటి నుంచి బస్సులు నడవకపోవడంతొ పాటు బస్సుల్లో పనిచేసే డ్రైవర్లు, కండక్టర్లు పనులు లేక ఖాళీగా ఉండేవారు. బస్సులను యథావిధిగా నడిపించడం లేదు సరికదా తమకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొనడంతో డ్రైవర్లు, కండక్టర్లు ఆందోళనకు దిగారు. 2015లో రాయగడ ఓఎస్‌ఆర్టీసీ డిపో ఏర్పాటైంది. ఈ డిపో పరిధిలో రాయగడ, కొరాపుట్ జిల్లల్ల్లో 9 రూట్లలో 11 బస్సులు నడుస్తుండేవి. ఈ బస్సుల్లో పనిచేస్తున్న 14 మంది డ్రైవర్లు, 12 మంది కండక్టర్లు జీవనోపాధి పొందుతుండేవారు.