
క్రీడలతో ఉజ్వల భవిష్యత్
రాయగడ: క్రీడలతొ ఉజ్వల భవిష్యత్ సాధ్యమని రాజ్యసభ మాజీ సభ్యుడు నెక్కంటి భాస్కరరావు అన్నారు. సదరు సమితి పరిధిలోని బొడొచాందిలి గ్రామంలో మార్చి 26 నుంచి ప్రారంభమైన ఫెండ్రీ క్రికెట్ టోర్నమెంటు ఆదివారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకునేందుకు ఇటువంటి టోర్నమెంట్లు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు వారి ప్రతిభను చాటుకోవడంతో పాటు భవిష్యత్‌ను ఉజ్వలంగా మార్చుకునేందుకు ఇలాంటి వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆదివాసీ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన టోర్నమెంటుల్లో వివిధ ప్రాంతాల నుంచి 32 జట్లు పాల్గొన్నాయని నిర్వాహకులు పెద్దింటి తపన్ కుమార్ అన్నారు. ఆదివారం నాడు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా సెరిగడు, ఎస్ పితేసు జట్లు తలపడగా సెరిగుడ విజేతగా నిలిచిందన్నారు. జేకేపేపర్ మిల్ సౌజన్యంతో కొనసాగిన టోర్నమెంటులో విజేత జట్టుకు ట్రోఫీతో పాటు 30 వేల రూపాయల నగదు, రన్నర్ జట్టుకు ట్రోఫీ, రూ. 20 వేలు ముఖ్యఅతిథిగా హాజరైన నెక్కంటి అందించారు. మాజీ మంత్రి లాల్ బిహారి హిమిరిక, బీజేడీ సీనియర్ నాయకుడు దూడల శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.
రాజ్యసభ మాజీ సభ్యుడు నెక్కంటి