
ఆకట్టుకున్న ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలు
ఆమదాలవలస : పట్టణంలోని పాలపోలమ్మ తల్లి ఆలయ ఆవరణలో శనివారం నిర్వహించిన ఉభయ రాష్ట్రాల నాటిక పోటీలు కళాప్రియులను ఆకట్టుకుంటున్నాయి. స్థానిక రంగస్థల కళాకారుల సంఘం ఆధ్వర్యంలో రెండవ రోజు కార్యక్రమంలో సీనియర్ రంగస్థల కళాకారులు, కలియుగ నక్షత్రిక పద్మశ్రీ యడ్ల గోపాలంను కమిటీ అధ్యక్ష కార్యదర్శులు తమ్మినేని విద్యాసాగర్ ,పేడాడ ప్రతాప్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి పురస్కారం అందించారు. అంతకుముందు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, బీజేపీ కన్వీనర్ పేడాడ సూరప్ప నాయుడు, మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పేడాడ పరమేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ తమ్మినేని గీత, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు పాత్రుని పాపారావు, కాంగ్రెస్ ఇన్‌చార్జి సనపల అన్నాజీరావు, డాక్టర్ దానేటి శ్రీధర్, బొడ్డేపల్లి సురేష్ మాట్లాడుతూ నిర్వాహకులను అభినందించారు. రెండో రోజు ప్రదర్శనలో హైదరాబాద్ కళాకారులు ప్రదర్శించిన స్వేచ్ఛ, ఆంధ్ర కళాకారులు ప్రదర్శించిన మరో రెండు నాటికలు ఆకట్టుకున్నాయి.