
సైకిల్‌పై యాత్రకు బయల్దేరిన అన్నదమ్ములు
జయపురం:
పుణ్యక్షేత్రాలైన చార్‌దామ్, గంగోత్రి, యమునాత్రి, కేదార్‌నాథ్, భద్రీనాథ్ మొదలగు పుణ్యక్షేత్రాలకు బొయిపరిగుడ గ్రామం నుంచి ఇద్దరు యువకులు సైకిల్ యాత్రతో గురువారం బయల్దేరారు. వారిరువులు అన్నదమ్ములు కావడం విశేషం. వారు బొయిపరిగుడకు చెందిన కవిరాజ్ పోలమ్ ఇద్దరు కుమారులు అశోక్ పోలమ్, గౌతమ్ పోలమ్‌లు. బొయిపరిగుడ నుంచి దాదాపు 2,200 కిలోమీటర్ల దూరం తాము సైకిళ్లపై 30 నుంచి 35 దినాల్లో పూర్తిచేసే లక్ష్యంతో సైకిల్ యాత్ర చేస్తున్నామని వెల్లడించారు. చిన్నతనం నుంచి చార్‌దామ్ వెళ్లాలన్న కోరిక తమకు ఉండేదని, అందువలన సైకిళ్లపై బయల్దేరినట్లు వెల్లడించారు. వారి పయనం విజయవంతం కావాలని బొయిపరిగుడ ప్రజలు ఆశీర్వదించారు.