
శుభరాట వేస్తున్న దృశ్యం
బరంపురం: స్థానిక గుసానినువాగంలో కొలువైన మా కాళువా ఉత్సవాలు అక్టోబర్ 14వ తేదీ నుంచి అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ మేరకు గుసానినువాగంలోని తాత్కాలిక ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో శుభరాట వేశారు. అక్టోబర్ 14వ తేదీ నుంచి గౌరీ పూర్ణిమ వరకు ఉత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు తెలియజేశారు. భక్తులు, సందర్శకులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని, అమ్మవారి ప్రధాన ఘటం తిరువీధుల్లో అర్థరాత్రి వరకు ఊరేగించనున్నట్లు పేర్కొన్నారు. ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కమిటీ ప్రతినిధులు మాజీ మేయర్ శిబశంకర్ దాస్ కోరారు.

మా కాళువ అమ్మవారి ఉత్సవ విగ్రహం