
బంగారు గొలుసు చోరీ జరిగిన సెల్ఫ్‌ను చూపుతున్న బాధితురాలు
టెక్కలి: టెక్కలి పోలీస్‌స్టేషన్‌కు వెనుక ఉన్న ఎన్‌టీఆర్ కాలనీలో వరుసగా దొంగతనాలు జరుగుతుండడంతో కాలనీ వాసులు భయాందోళన చెందుతు న్నారు. కాలనీలో గల 5వ లైన్ వీధిలో నివాసం ఉంటున్న జానకి వనజాక్షి ఇంటిలోకి బుధవారం అర్ధరాత్రి దొంగలు ప్రవేశించి మెయిన్‌గేట్ తాళాలు, పక్క గేట్ తాళాలతో పాటు ఇంటి తలుపులు తెరచి మెయిన్‌హాల్ సెల్ఫ్‌లో ఉన్న రెండు తులాల బంగారు గొలుసును దొంగిలించారు. గురువారం ఉద యం లేచి చూసే సరికి ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. ఇంట్లో మొత్తం సామాన్లు చిందరవందరగా పడి ఉండడంతో భయాందోళనకు గురయ్యారు. సామాన్లు చూసుకోగా మెయిన్‌హాల్ సెల్ఫ్ లో భద్రపరచిన రెండు తులాల బంగారు గొలుసు దొంగతనానికి గురైనట్లు గుర్తించారు. దీంతో టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగలు ఇంటి తాళాలు సైతం ఎత్తుకుపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మూడు రోజుల కిందట ఇదే ఇంటిలో పట్టపగలే దొంగలు చొరబడి ఖరీదైన సెల్‌ఫోన్‌ను ఎత్తుకుపోయారు. పోలీస్‌స్టేషన్‌కు వెనుక ఉన్న వీధిలో వరుసగా దొంగతనాలు జరుగుతుండడంతో కాలనీవాసులంతా భయాందోళన చెందుతున్నారు.