మా దగ్గర ఉన్న రికార్డుల ప్రకారం ప్రతి స్కూలుకు ఇన్‌డోర్ లేదా అవుట్ డోర్ క్రీడా మైదానం ఉంటేనే అనుమతి లేదా రెన్యువల్‌కు అవ కాశం ఇస్తున్నాం. వ్యాయామ విద్య తప్పనిసరని స్పష్టం చేస్తున్నాం. ఆ క్లాసులు అమలు చేస్తున్నారో లేదో మేము ఒకసారి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం. కచ్చితంగా అమలయ్యేలా చూస్తాం. ఇండోర్ లేదా ఔట్ డోర్ స్పోర్ట్స్‌ను స్కూల్ యాజమా న్యాలు నిర్వహించాల్సిందే. స్కూళ్లలో తనిఖీలు చేయించి, నిబంధనలు పాటించ కుంటే చర్యలు తీసుకుంటాం.
– చంద్రకళ, ఎన్టీఆర్ జిల్లా, డీఈఓ


