గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కెనడాలో జరగనున్న కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌నకు ఎంపికై న జి.కొండూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన క్రీడాకారుడు సంకు కృపారావు అంతర్జాతీయ వేదికపై పతకం సాధించి ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. అంతర్జాతీయ స్థాయి పోటీలో పాల్గొనేందుకు అవసరమైన ఆర్థిక సహాయం కోసం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశను ఆశ్రయించారు. ప్రతిభకు ఆర్థిక పరిస్థితులు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో కలెక్టర్ లక్ష్మీశ వెంటనే స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీ4 కార్యక్రమం ద్వారా క్రీడాకారుడికి సహాయం అందించేలా అనుసంధానించారు. ఈ మేరకు సెంటిని బయో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమకూర్చిన రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని గురువారం కలెక్టర్ కార్యాలయంలో క్రీడాకారుని కుటుంబ సభ్యులకు కలెక్టర్ అందజేశారు. సెంటిని బయో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ జీఎం కె.మనోజ్ కుమార్ పాల్గొన్నారు.


