కోర్టుకు హాజరైన కారుమూరి | - | Sakshi
Sakshi News home page

కోర్టుకు హాజరైన కారుమూరి

Sep 18 2026 2:21 AM | Updated on Sep 18 2026 2:21 AM

కోర్టుకు హాజరైన కారుమూరి

విజయవాడలీగల్‌: అక్రమ మద్యం రవాణా కేసులో హైదరాబాద్‌ చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న కారుమూరి నాగేశ్వరరావును పీటి వారెంట్‌పై సిట్‌ అధికారులు గురువారం విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానంలో ఆయన తరఫు న్యాయవాదులు దాసరి అనిల్‌కుమార్‌, బండారు శివకుమార్‌, డక్కు కోటేశ్వరరావు వాదనలు వినిపించారు. విచారణ అనంతరం న్యాయమూర్తి ఈనెల 25వ తేదీ వరకు పీటి వారెంట్‌పై రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు జారీచేశారు. అనంతరం పోలీసులు నాగేశ్వరరావును చంచల్‌గూడ జైలుకు తరలించారు.

కేసు విచారణ వాయిదా..

దాదాపు రెండు దశాబ్దాల క్రితం విజయవాడలో సంచలనం సృష్టించిన వి.దుర్గాప్రసాద్‌ అలియాస్‌ పిల్లి దుర్గాప్రసాద్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో బుధవారం 8వ అదనపు జిల్లా న్యాయస్థానంలో విచారణ జరిగింది. తదుపరి విచారణను న్యాయమూర్తి ఎన్‌.పద్మావతి ఈనెల 21వ తేదీకి వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement