మొక్కల సంరక్షణ, కాలుష్య నివారణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

మొక్కల సంరక్షణ, కాలుష్య నివారణకు చర్యలు

Apr 4 2026 9:49 AM | Updated on Apr 4 2026 9:49 AM

మొక్కల సంరక్షణ, కాలుష్య నివారణకు చర్యలు

పరీక్ష బాగా రాయలేదనే మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య

పటమట(విజయవాడతూర్పు): మొక్కల సంరక్షణ, కాలుష్య నివారణ అంశాలపై విజయవాడ నగర పాలక సంస్థ చర్యలు తీసుకుంటుందని స్పెషల్‌ ఆఫీసర్‌, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ చెప్పారు. ఆదివారం ఉదయం కమిషనర్‌ ధ్యానచంద్రతో కలిసి ఆయన విజయవాడ కృష్ణలంక ఫైర్‌ స్టేషన్‌ వద్ద బందర్‌ కెనాల్‌ బండ్‌ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన బందర్‌ కెనాల్‌ బండ్‌పై నాటిన మొక్కలకు స్ప్రింక్లర్‌ వ్యవస్థ ద్వారా అందిస్తున్న నీటి సరఫరాను వారు సమీక్షించారు. మొక్కల సంరక్షణ, పచ్చదన విస్తరణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. అలాగే నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు నగరపాలక సంస్థ అమలు చేస్తున్న చర్యలను పరిశీలించారు. ముఖ్యంగా రహదారులపై కాలుష్య నియంత్రణ కోసం వినియోగిస్తున్న ప్రత్యేక (మిస్ట్‌) వాహనాల పనితీరును ప్రత్యక్షంగా వీక్షించి, మరింత సమర్థవంతంగా చర్యలు చేపట్టాలని సూచించారు.

గుడివాడరూరల్‌: పరీక్ష సరిగ్గా రాయలేదని ఓ విద్యార్థిని మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన గుడివాడ తాలూకా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గంగాధరపురంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. తాలూకా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొమ్ములూరు గ్రామ శివారు ఉన్న గంగాధరపురానికి చెందిన బండ్ల హనుమంతరావు కుమార్తె హాసిని ఓ ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో డిప్లమో మొదటి సంవత్సరం చదువుతోంది. ఈనెల 1వ తేదీన పరీక్ష రాయడానికి కళాశాలకు వెళ్లింది. ఈ క్రమంలో అనారోగ్యానికి గురై పరీక్ష సరిగ్గా రాయకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. 2న కళాశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయింది. తల్లి ఆశాలత పని నిమిత్తం బయటకు వెళ్లి మధ్యాహ్నం ఫోన్‌ చేసింది. ఆ సమయంలో కుమార్తె హాసిని తనకు ఒంట్లో బాలేదని, వాంతులు అవుతున్నాయని తల్లికి తెలిపింది. వెంటనే తల్లి ఇంటికి వచ్చి చూడగా గదిలో హాసిని ఆపస్మారక స్థితిలో పడి ఉంది. దీంతో వెంటనే స్థానికుల సహాయంతో హాసిని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. శుక్రవారం పోస్టుమార్టం అనంతరం హాసిని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలు తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement