పారా కబడ్డీ రాష్ట్ర పురుషుల జట్టు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

పారా కబడ్డీ రాష్ట్ర పురుషుల జట్టు ఎంపిక

Mar 27 2026 9:51 AM | Updated on Mar 27 2026 9:51 AM

గన్నవరం: పారా కబడ్డీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో స్థానిక ఎస్వీఆర్‌ ఇండోర్‌ హాలులో గురువారం పారా పురుషుల రాష్ట్ర కబడ్డీ జట్టు ఎంపిక నిర్వహించారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన క్రీడాకారులు ఈ సెలక్షన్స్‌కు హాజరయ్యారు. వీరిలో అత్యుత్తమ క్రీడా నైపుణ్యం కనబరిచిన 14మంది క్రీడాకారులకు రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసినట్లు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వెలగపూడి ఉజ్వల్‌ తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు చండీగఢ్‌లో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. జట్టు కోచ్‌గా డీఎన్‌ నాగరాజు, మేనేజర్‌గా చరణ్‌తేజ వ్యవహరించనున్నారన్నారు. ఈ సందర్భంగా ఎంపికై న క్రీడాకారులను ఉజ్వల్‌, ఒలింపిక్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి కేపీ రావు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement