పెనమలూరు: ఇసుక ట్రాక్టర్ ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. విజయవాడ–అవనిగడ్డ కరకట్టపై ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటనలో డెలివరీ బాయ్ దుర్మరణం చెందాడు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెనమలూరు పల్లిపేటకు చెందిన కొక్కిలిగడ్డ దుర్గేష్ (32) భార్య వీరలక్ష్మి, ఇద్దరు పిల్లలతో ఉంటున్నాడు. అతను డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. కాగా బుధవారం సాయంత్రం పెదపులిపాక శ్రీనగర్‌కాలనీలో డెలివరీ ఇవ్వటానికి బైక్‌పై వెళుతుండగా ఇసుక ట్రాక్టర్ అతి వేగంగా వచ్చి అతనిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో దుర్గేష్ తీవ్రంగా గాయపడి స్పాట్‌లో మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య వీరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.


