అన్ని వర్గాలకూ వంచన | - | Sakshi
Sakshi News home page

అన్ని వర్గాలకూ వంచన

Feb 17 2026 8:58 AM | Updated on Feb 17 2026 8:58 AM

అన్ని

అన్ని వర్గాలకూ వంచన

సూపర్‌ సిక్స్‌ను గాల్లో కలిపేశారు ఇదేనా విజనరీ పాలన అంటే.. 50 ఏళ్లకే పింఛన్లు ఎప్పుడు బాబూ

బడ్జెట్‌

2026–27

సూపర్‌సిక్స్‌లో నాలుగు హామీలకు చంద్రబాబు సర్కార్‌ పంగనామాలు పెట్టింది. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకు 50ఏళ్లకే పింఛన్‌లు, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకాలకు గత రెండు బడ్జెట్‌లతో పాటు ఈ బడ్జెట్‌లో కూడా నిధులు కేటాయించలేదు. అంకెల గారడీ తప్ప అమలులో సాధ్యమయ్యేలా లేదు. ప్రజలను నమ్మించి మోసం చేసినందుకు ప్రభుత్వానికి తగిన బుద్ధిచెబుతారు.

–వేములకొండ తిరుపతిరావు(వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి, పంచాయతీరాజ్‌ విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌)

చంద్రబాబు సర్కార్‌ ప్రవేశపెట్టిన మూడో బడ్జెట్‌లో అన్ని వర్గాలనూ వంచనకు గురి చేశారు. ఎన్నికల ముందు సూపర్‌సిక్స్‌ హామీలంటూ ఊదరగొట్టి ఇప్పడు వాటికి బడ్జెట్‌లో కేటాయింపులు లేవు. 18 నుంచి 59 ఏళ్ల వయసు లోపు మహిళలకు ఆడ్డబిడ్డ నిధి కింద రూ.1500 అంటూ ఊరావాడా ప్రచారం చేసి.. మూడో బడ్జెట్‌లో కూడా దాని ఊసే లేదు. నాడు ఎడాపెడా హామీలు ఇచ్చి.. బడ్జెట్‌లో అంకెల గారడీ తప్ప ఏమీ లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు

–సాక్షి నెట్‌వర్క్‌

రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అన్ని వర్గాలనూ వంచనకు గురిచేస్తోంది. గత ప్రభుత్వంలో డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ క్రమం తప్పకుండా చెల్లించాం. చంద్రబాబు ప్రభుత్వం డ్వాక్రా మహిళలను మోసం చేసింది. ఎన్నికల ముందు సూపర్‌సిక్స్‌ అంటూ ప్రచారం చేసి, ఇంటింటికీ బాండ్లు ఇచ్చారు. కొత్త ఫించన్లు డివిజన్‌కు ఒకటీ, రెండు కూడా మంజూరు కావడం లేదు. ఉచిత బస్సు పథకం పెట్టి, బస్సులను తగ్గించేశారు. విద్యార్థులు వెళ్లేందుకు బస్సులు లేక అవస్థ పడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. ఇదేనా విజనరీ పాలన అంటే.

– బెల్లం దుర్గ, డిప్యూటీ మేయర్‌, విజయవాడ కార్పొరేషన్‌

గెలిపిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామంటూ ఎన్నికల ముందు ప్రచారం హోరెత్తించిన చంద్రబాబు, ఇప్పుడు ఆ పథకం ఊసే ఎత్తడం లేదు. అంతేకాదు సూపర్‌సిక్స్‌ పేరుతో కూటమి నాయకులు ఇంటింటికీ తిరిగి బాండ్లు ఇచ్చి మరీ నమ్మబలికారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 50 ఏళ్లు నిండిన వారంతా ిపింఛన్లు వస్తాయని ఆశగా ఎదురు చూశారు. వారి ఆశలు అడియాసలను చేశారు. మూడుసార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టినా, 50 ఏళ్ల పింఛన్‌ పథకం ఊసే ఎత్త లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను మరోసారి మోసం చేశారు.

–ఎండీ నాహీద్‌, జిల్లా అధికార ప్రతినిధి, వైఎస్సార్‌ సీపీ

అన్ని వర్గాలకూ వంచన 1
1/2

అన్ని వర్గాలకూ వంచన

అన్ని వర్గాలకూ వంచన 2
2/2

అన్ని వర్గాలకూ వంచన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement