రవాణా శాఖలోనూ ప్రైవేటు బాదుడు | - | Sakshi
Sakshi News home page

రవాణా శాఖలోనూ ప్రైవేటు బాదుడు

Dec 12 2025 6:03 AM | Updated on Dec 12 2025 6:03 AM

రవాణా శాఖలోనూ ప్రైవేటు బాదుడు

రవాణా శాఖలోనూ ప్రైవేటు బాదుడు

రవాణా శాఖలోనూ ప్రైవేటు బాదుడు లబ్బీపేట(విజయవాడతూర్పు): రవాణాశాఖ దేశ వ్యాప్తంగా వాహనాల ఫిట్‌నెస్‌ను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించింది. జిల్లాకు ఒక చోట కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఎన్టీఆర్‌ జిల్లాకు సంబంధించి నున్నలో ఏర్పాటు చేశారు. ఏదైనా వాహనం అక్కడకు ఫిట్‌నెస్‌కు వెళ్లాలంటే అనధికారికంగా చెల్లించే మొత్తాన్ని ముందుగానే ఏజెంట్లు వాహనదారులకు చెపుతున్నారు. ఆటోకు రూ.900, కార్లు అయితే టాక్సీకి ఒకరేటు, ఓన్‌ వెహికల్‌కు ఒకరేటు నిర్ణయించి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. లారీలు, బస్సులు ఇలా ఏ వాహనం వెళ్లినా వారికి ముడుపులు చెల్లించాల్సిందే. ఫిట్‌నెస్‌ తనిఖీ సమయంలో ఏదైనా డ్యామేజీ గుర్తిస్తే అదనంగా చెల్లించుకోవాల్సిందే. ఫిట్‌నెస్‌ పరీక్షకు వెళ్లాల్సిన తేదీన ఏదైనా అత్యవసర పనిపై వెళ్లలేకుంటే, అదే రోజు ఆన్‌లైన్‌ సెంటర్‌కు వెళ్లి, మరలా మరోతేదీని ఎంచుకోవాల్సి ఉంది. సాయంత్రం 4 గంటల్లోపు వెళ్లి ఆప్షన్‌ పెట్టకుంటే ఫిట్‌నెస్‌ కోసం చెల్లించిన చలానా మొత్తం పోతుంది. మరలా చలానా కట్టాల్సి ఉంటుంది. ఒక్కోసారి సాయంత్రం సమయంలో పరివాహన్‌ పోర్టల్‌ మొండికేస్తుంది. అలాంటప్పుడు కూడా చలానా పోతున్నట్లు వాహనదారులు చెపుతున్నారు. గతంలో ఆ రోజు వెళ్లడం కుదరకపోతే, తర్వాత రోజుకు రూ.10 అదనంగా చెల్లించి వెళ్లే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ వెసులుబాటును తీసేయడం, లారీలు వంటి వాటికి ఫిట్‌నెస్‌ చార్జీలు పెద్ద మొత్తంలో పెంచడంతో అత్యవసరంగా వేరొక పని ఉండి, స్లాట్‌ ఇచ్చిన రోజు వెళ్లలేకుంటే నష్టపోవాల్సి వస్తోందంటున్నారు.

లైసెన్స్‌ల జారీలోనూ...

లైసెన్స్‌ల జారీకి గన్నవరంలో టెస్టింగ్‌ సెంటర్‌ ఉంది. ఇటీవల అక్కడ సెన్సార్‌లు ఏర్పాటు చేశారు. వాటిని ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. డ్రైవింగ్‌ చేసే సమయంలో సెన్సార్‌లు గుర్తిస్తాయి. దీంతో ఎవరైనా డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం అక్కడికి వెళితే ముడుపులు ఇస్తేనే టెస్టింగ్‌లో పాస్‌ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు వారు అడిగినంత ఇస్తే కారు నడపకుండానే లైసెన్స్‌లు ఇచ్చేస్తున్నట్లు చెపుతున్నారు. దీంతో లైసెన్స్‌ల జారీలో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోంది. వాస్తవంగా ద్విచక్ర వాహనం లైసెన్స్‌ కోసం అధికారిక ఫీజు రూ.960 చలానా రూపంలో చెల్లించాల్సి ఉంది. అదే బైక్‌, కారు రెండూ అయితే రూ.1260 చెల్లించాలి. కానీ ఏజెంటు బైక్‌కు రూ.3500 నుంచి రూ.4500 వరకూ వసూలు చేస్తున్నారు. కారు, బైక్‌ రెండూ అయితే రూ.7 వేల నుంచి రూ.8 వేలు తీసుకుంటున్నారు.

మా పరిధిలో లేదు

నున్నలోని ఫిట్‌నెస్‌ సెంటర్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థకు అప్పగించింది. దానిని తనిఖీ చేసే అధికారం కూడా మాకు లేదు. ఏదైనా సమస్య ఉంటే ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేయాలి.

వాహనాలు ఫిట్‌నెస్‌కు తీసుకెళ్లారంటే యజమా నుల జేబులు ఖాళీ అవుతున్నాయి. అధికారికంగా ఫీజును చలానా రూపంలో చెల్లించినా, ఫిట్‌నెస్‌ టెస్టింగ్‌ వద్ద అనధికారిక దోపిడీ పెరిగిపోయింది. దీంతో అక్కడ చేయి తడిపితేనే ఫిట్‌నెస్‌, లేదంటే ఏదో ఒక లోపం చూపించడంతో ఇవ్వక తప్పడం లేదు. ఇలా ఫిట్‌నెస్‌కే కాదు, లైసెన్స్‌ జారీ లోనూ సెన్సార్‌లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతో దోపిడీ మరింత పెరిగినట్లు చెపుతున్నారు. ఒకప్పుడు రవాణాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమయంలోనే బాగుండేదని, ఇప్పుడు ప్రైవేటుకు అప్పగించిన నాటి నుంచి దోపిడీ పెరిగిపోయిందని వాహనదారులు వాపోతున్నారు.

ఆన్‌లైన్‌ చిక్కులు...

డబ్బులు ఇస్తేనే ఫిట్‌నెస్‌ ఽధ్రువీకరణ

ఏదైనా లోపం ఉంటే అదనంగా

చెల్లించుకోవాల్సిందే

లైసెన్స్‌ల జారీలోనూ ఇదే పద్ధతి

సెన్సార్‌లు ప్రైవేటుకు

అప్పగించాక మరింత పెరిగిన దోపిడీ

–ఎ.మోహన్‌, జేటీసీ, విజయవాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement