విజయవాడ సిటీ
న్యూస్‌రీల్
ఇష్టారాజ్యంగా సుబాబుల్ ధరల నిర్ణయం నెల రోజుల్లో టన్ను ధర రూ.900 తగ్గింపు ఆందోళన చెందుతున్న సుబాబుల్ రైతులు
తిరోగమనంలో ధర
ఎన్టీఆర్ జిల్లా
బుధవారం శ్రీ 10 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 109 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 4400 క్యూసెక్కులు వదులుతున్నారు. నిల్వ 43.3532 టీఎంసీలు.
ఇంద్రకీలాద్రి: భవానీ దీక్షల విరమణ ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా మంగళవారం సాయంత్రం ఇంద్రకీలాద్రికి వచ్చిన హోం మంత్రి వంగలపూడి అనిత దుర్గమ్మను దర్శించుకున్నారు.
పాయకాపురం (విజయవాడ రూరల్): ఆయుష్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు న్యూఢిల్లీ లోని భారత్ మండపంలో రెండో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సమ్మిట్ జరుగుతుందని ఆయుర్వేద పరిశోధన అధికారి డాక్టర్ కె.మిథున్ మోహన్ తెలిపారు. విజయవాడ పాయకాపురంలోని న్యూ రాజీవ్‌నగర్‌లో ఉన్న ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ఆవరణలో మంగళవారం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కె. మిథున్ మోహన్ మాట్లాడుతూ.. ఆయుష్ వ్యవస్థల ప్రత్యేక ప్రదర్శన, దేశ జ్ఞాన వారసత్వం, ప్రజారోగ్య సమన్వయం, పరిశో ధన – సాంకేతికత, అనుభవాత్మక వెల్‌నెస్ వంటి రంగాలను ప్రతిబింబించే ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. సుమారు వంద దేశాల నుంచి ఐదు వేల మంది ప్రతినిధులు వర్చువల్‌గా పాల్గొంటారని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్‌లో 700 మంది ప్రత్యక్షంగా హాజరు కానున్నారని, వందకు పైగా దేశాల నుంచి 79 అధికారిక ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతినిధులు పాల్గొంటారని వివరించారు. సమ్మిట్ ముగింపు రోజున ప్రధానమంత్రి నరేంద్రమోదీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అఽధానోంగేబ్రియేసస్, పలు దేశాల ఆరోగ్య మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటా రని వెల్లడించారు. ఈ సమావేశంలో పరిశోధన అధికారులు డాక్టర్ సుజాత, పి.ధోకే తదితరులు పాల్గొన్నారు.
పెనుగంచిప్రోలు: పేపర్ కంపెనీలు కొన్ని సిండికేట్ అయ్యాయి. సుబాబుల్ రైతుల రెక్కల కష్టాన్ని దోచుకుంటున్నాయి. ఇష్టారాజ్యంగా ధరలను నిర్ణయిస్తూ నష్టాలపాలు చేస్తున్నాయి. పేపర్ కంపెనీలు ఏకపక్షంగా ధరలను భారీగా తగ్గించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, జగ్గయ్య పేట, మైలవరం, తిరువూరు నియోజకవర్గాల పరిధిలో సుబాబుల్ సాగు ఎక్కువగా జరుగు తోంది. జిల్లాలో మొత్తం మీద సుమారుగా 70 వేల ఎకరాల్లో సుబాబుల్ సాగవుతోంది. పత్తి, మిర్చి సాగు చేసిన రైతులు ఆ పంటల్లో దిగుబడి లేక, గిట్టుబాటు ధర దక్కక సుబాబుల్ సాగు చేపట్టారు. అయితే పేపర్ కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలు తగ్గించడంతో సుబాబుల్ సాగులోనూ నష్టాలు తప్పడంలేదని వాపోతున్నారు. ఇటీవల వరకు టన్ను సుబాబుల్ ధర రూ.6,500 వరకు పలికింది. నెల రోజుల్లో ఆ ధర కాస్తా రూ.5,600కు పడి పోయింది. అంటే నెల రోజుల్లోనే రైతులు టన్నుకు రూ.900 చొప్పున నష్టపోతున్నారు.
అజమాయిషీ లేదు
సుబాబుల్ మార్కెట్‌పై ఎటువంటి అజమాయిషీ లేక పోవటంతో కంపెనీల ఇష్టారాజ్యంగా తయారైంది. గతంలో వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా సుబాబుల్ కర్ర కొనుగోళ్లు జరిగేవి. కర్ర ఎంత ఉత్పత్తి జరుగుతోంది, ఎంత కొనుగోళ్లు జరిగాయి వంటి వివరాలు మొత్తం ఏఎంసీల వద్ద ఉండేవి. ఏఎంసీల ద్వారానే కంపెనీలు రైతులకు డబ్బులు చెల్లించేవి. అయితే అమ్మకం పన్ను చెల్లించాల్సి రావటంతో కొన్నేళ్ల నుంచి ఏఎంసీల ద్వారా కర్ర కొనుగోళ్లు తీసేశారు. ప్రస్తుతం పేపర్ కంపెనీలు, వ్యాపారుల ద్వారానే కర్ర విక్రయాలు జరుగుతున్నాయి. వారు చెప్పిందే ధర అన్నట్లుగా తయారైంది. ఇటీవల మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు, ఏఎంసీల కార్యదర్శులతో సమావేశం నిర్వహించి ధర తగ్గకూడదని చెప్పినా వాస్తవంలో అది జరగటం లేదని రైతులు అంటున్నారు.
ఆందోళనలో రైతులు
వర్షాలు తగ్గుముఖం పట్టటంతో కర్ర కోత బాగా పెరిగింది. ధర ఆశాజనకంగా ఉంటుందని భావించిన రైతులకు నిరాశే మిగిలింది. సుబాబుల్ దిగుబడులు పెరుగుతున్న నేపథ్యంలో పేపర్ కంపెనీలు ధర తగ్గించాయని రైతులు ఆరోపిస్తున్నారు. రానున్న రోజుల్లో మరింత తగ్గుతుందేమే అని ఆందోళన చెందుతున్నారు. పేపర్ కంపెనీలకు అవసరమైనప్పుడు ధర పెంచటం లేనప్పుడు తగ్గించటం చేస్తున్నాయని, ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
భవానీ దీక్షల విరమణకు వేళాయె
7
పత్తి, మిర్చి సాగులో ఏటా నష్టాల పాలవుతున్న రైతులు సుబాబుల్ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. సుబాబుల్ ధర బాగుండటంతో పాటు సాగు నీరు అంతగా అవసరం లేక పోవటం వంటి కారణాలతో రైతులు ఎక్కువగా ఈ పంట సాగుకు మొగ్గు చూపారు. మొక్క నాటిన రెండు నుంచి మూడేళ్లకు కర్ర కోతకు వస్తుంది. ఎకరానికి సగటున 30 నుంచి 35 టన్నుల దిగుబడి చేతికొస్తుంది. కర్ర దిగుబడి పెరగటంతో పేపర్ కంపెనీలు మళ్లీ తమను దోపిడీకి గురి చేస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే టన్ను ధర రూ.900 చొప్పున తగ్గించాయని వాపోతున్నారు. ముఖ్యంగా ఐటీసీ భద్రాచలం, ఏపీపీ రాజమండ్రి, బలార్షా, సిర్పూర్ కాగజ్‌నగర్, జేకే కంపెనీలు రైతుల వద్ద నుంచి సుబాబుల్ కర్ర కొనుగోలు చేస్తాయి. కొన్ని కంపెనీలు సిండికేట్‌గా మారి ధరను తగ్గిస్తున్నాయి.
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ


