● ఉత్సాహంగా.. ఉల్లాసంగా బాలోత్సవం
విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ఎనిమిదో అమరావతి బాలోత్సవం మంగళవారం ప్రారంభమైంది. మంత్రి కందుల దుర్గేష్ ముఖ్యఅతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 60 అంశాల్లో నిర్వహించిన వివిధ పోటీల్లో విజయవాడ నగరంలోని పాఠశాలలతో పాటుగా కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు జిల్లాల్లోని పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. బుధ, గురువారాల్లో కూడా పోటీలు కొనసాగుతాయని బాలోత్సవం ప్రధాన కార్యదర్శి కొండలరావు తెలిపారు. సభ అనంతరం సిద్ధార్థ ఆడిటోరియం, కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పలు వేదికలపై జరిగిన సాంస్కృతిక పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
– మొగల్రాజపురం(విజయవాడ తూర్పు)
● ఉత్సాహంగా.. ఉల్లాసంగా బాలోత్సవం


