విభిన్న ప్రతిభావంతుల్లో మనోధైర్యం పెంచే క్రీడలు | - | Sakshi
Sakshi News home page

విభిన్న ప్రతిభావంతుల్లో మనోధైర్యం పెంచే క్రీడలు

Nov 28 2025 7:28 AM | Updated on Nov 28 2025 7:28 AM

విభిన

విభిన్న ప్రతిభావంతుల్లో మనోధైర్యం పెంచే క్రీడలు

విభిన్న ప్రతిభావంతుల్లో మనోధైర్యం పెంచే క్రీడలు

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): విభిన్న ప్రతిభవంతులు సకలాంగులకు దీటుగా క్రీడల్లో రాణించి సత్తా చాటాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ సూచించారు. వైకల్యం మనిషికే గాని మనసుకు కాదన్నారు. విభిన్నప్రతిభావంతుల్లో మనోధైర్యం పెంచేందుకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభవంతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఇందిరాగాంధీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను కలెక్టర్‌ లక్ష్మీశ జెండా ఊపి ప్రారంభించారు. తొలుత జిల్లా కలెక్టర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ.. విభిన్న ప్రతిభావంతులకు అవసరమైన తోడ్పాటు అందిస్తే ఎటువంటి విజయాలనైన సొంతం చేసుకుంటారని, ఆంధుల తొలి టీ20 ప్రపంచ కప్‌ క్రికెట్‌ పోటీల్లో మన దేశం విజయం సాదించడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. భారత్‌ జట్టులో స్థానం పొంది విజయంలో కీలక పాత్ర పోషించిన క్రికెటర్లు టి.దీపిక, కరుణకుమారిని ఆదర్శంగా తీసుకుని క్రీడల్లో రాణించాలని సూచించారు. విభిన్న ప్రతిభావంతుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడంతో పాటు వారిలో మానసిక స్థైర్యాన్ని నింపేందుకు ఇటువంటి క్రీడా పోటీలు దోహదపడతాయన్నారు. వైకల్యాన్ని గురించి ఆలోచించక క్రీడాలలో రాణించడం ద్వారా విభిన్న ప్రతిభావంతుడు ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలని కలెక్టర్‌ కోరారు. పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరు విజేయతగా భావించాలన్నారు. సమాజంలో అన్ని రంగాలలో రాణించేలా విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు సహకార కార్పొరేషన్‌ చైర్మన్‌ జి.నారాయణ స్వామి, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ జిల్లా సహాయ సంచాలకుడు వి.కామరాజు మాట్లాడుతూ.. విభిన్న ప్రతిభావంతులకు జిల్లా స్థాయిలో జూనియర్‌, సీనియర్‌ మహిళలు, పురుషుల విభాగాల్లో చెస్‌, క్యారమ్స్‌, సాఫ్ట్‌ బాల్‌, వాలీబాల్‌, రన్నింగ్‌, ట్రై సైకిల్‌ రేస్‌, షాట్‌ఫుట్‌ వంటి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని వివిధ పాఠశాల లకు చెందిన 300 మందికి పైగా విభిన్న ప్రతిభావంతులు పోటీల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ పర్యవేక్షకులు ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.

పరుగుపందెంలో పాల్గొన్న విభిన్న ప్రతిభావంతులు

విభిన్న ప్రతిభావంతుల క్రీడలను ప్రారంభిస్తున్న కలెక్టర్‌ లక్ష్మీశ

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మీశ

విభిన్న ప్రతిభావంతుల్లో మనోధైర్యం పెంచే క్రీడలు1
1/1

విభిన్న ప్రతిభావంతుల్లో మనోధైర్యం పెంచే క్రీడలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement