గడువులోపు దరఖాస్తు చేసుకోండి..
ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోపు అనధికార భవనాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. విద్యుత్తు, నీటి సరఫరాను నిలిపివేస్తాం. బ్యాంకు లోన్లు రావు. ఆ ఆస్తిని అమ్ముకొనే వెసులుబాటు ఉండదు. పన్ను సైతం డబుల్ వేస్తారు. దీనిని దృష్టిలో ఉంచుకొని దరఖాస్తులను అర్హత కలిగిన లైసెన్స్, టెక్నికల్ పర్సన్ ద్వారా అవసరమైన పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 31.12.1997కు ముందు నిర్మించిన భవనాలకు ప్రభుత్వం క్రమబద్ధీకరణ రుసుంపై 25 శాతం రాయితీ మంజూరు చేస్తోంది, దీనిని సద్వినియోగం చేసుకోవాలి.
– కె. సంజయ్ రత్నకుమార్,
చీఫ్ సిటీ ప్లానర్, నగర పాలక సంస్థ


