భలే గుడ్లు!
గోలీ సైజులోని గుడ్లను చూపుతున్న కృష్ణారావు
కృష్ణాజిల్లా కోడూరు మండలం ఊటగుండం గ్రామానికి చెందిన చేబోయిన కృష్ణారావు పెరట్లోని ఓ కోడి పెట్టిన గుడ్లు గోలీ సైజులోనే ఉన్నాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఎంతో ఆసక్తిగా వాటిని తిలకిస్తున్నారు. సాధారణంగా కోడిగుడ్డు దీర్ఘవృత్తాకారం(అండాకారం)లో ఉంటూ సుమారు 50 నుంచి 60 గ్రాముల మధ్య బరువు ఉంటుంది. అయితే ఆ కోడి బుధ, గురు వారాల్లో నాలుగు గుడ్లు పెట్టగా, అవి 10 గ్రాముల లోపే ఉండడంతో పాటు వృత్తాకారంలో ఉన్నాయి. – కోడూరు
భలే గుడ్లు!


