తప్పిపోయిన నాలుగేళ్ల చిన్నారి క్షేమం
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): మహంతీపురం పరిధిలో గురువారం నాలుగేళ్ల చిన్నారి తప్పి పోవడంతో తల్లిదండ్రులు కొత్తపేట పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సకాలంలో స్పందించిన స్థానికుల సహకారంతో బాలుడిని గుర్తించి తల్లికి అప్పగించారు. ఏలూరు జిల్లా పాతూరు గ్రామానికి చెందిన నాగుల్‌మీరా, మీరాబీ దంపతుల కుటుంబం మహంతీపురంలోని ఓ వివాహానికి హాజరైంది. ఇంట్లో అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న తరుణంలో నాగుల్‌మీరా కుమారుడు నాలుగేళ్ల జాహిద్ ఆడుకుంటూ రోడ్డుపైకి వచ్చి తప్పిపోయాడు. కొంత సేపటి తరువాత జాహిద్ కనిపించడం లేదని గుర్తించిన తల్లిదండ్రులు, బంధువులు కంగారు పడుతూ చుట్టు పక్కల వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. అనంతరం కొత్తపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాలుడి కోసం గాలింపు చేపట్టారు. ఇంతలో స్థాని కులు రోడ్డుపై బాలుడు ఏడుస్తూ వెళ్లడాన్ని గమనించారు. అదే సమయంలో బాలుడి కోసం గాలిస్తున్న పోలీసులు బాలుడిని గుర్తించి తల్లికి అప్పగించారు.
కూచిపూడి(మొవ్వ): పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కూచిపూడి శ్రీ సిద్ధేంద్ర యోగి నాట్య కళా పీఠంలో 2025–26 విద్యా సంవత్సరానికి నాట్యంలో ప్రవేశాల ఇంటర్వ్యూలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 20వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. 133 మంది ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకున్నారని కళాపీఠం వైస్ ప్రిన్స్‌పాల్ డాక్టర్ చింతా రవిబాలకృష్ణ తెలిపారు. సర్టిఫికెట్ కోర్సుకు 47, డిప్లొమా 30, యక్షగానం 18, సాత్విక అభి నయం 10, మాస్టర్ ఆఫ్ ఫెర్ఫార్మింగ్ ఆర్ట్స్(ఎంపీఏ)కు 28 మంది దర ఖాస్తు చేసుకున్నారని వివరించారు. సాత్విక అభినయం, యక్షగానం, ఎంపీఏకోర్సులకు సంబంధించి అభ్యర్థుల దరఖాస్తులు పరిశీలన, ఇంటర్వ్యూలను గురువారం కళాపీఠంలో నిర్వహించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏలేశ్వరపు శ్రీనివాసులు, పసుమర్తి హరినాథశాస్త్రి పాల్గొన్నారు.
స్లీప్‌వెల్ అగరుబత్తీల్లో పురుగు మందుల అవశేషాలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్లీప్‌వెల్ అగరు బత్తీల్లో పురుగు మందుల అవశేషాలు ఉన్నట్లు తేలడంతో విజయవాడలోని దుకాణాల్లో వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. గురువారం వ్యవసాయ శాఖ ఏడీ వెంకటేశ్వరరావు, అర్బన్, రూరల్ వ్యవసాయాధికారులు తేజస్విని, రఘురాంతో కలిసి వన్‌టౌన్‌లోని గొల్లపూడి రాధకృష్ణమూర్తికి చెందిన స్టాక్ పాయింట్‌ను తనిఖీ చేశారు. అతని వద్ద రూ.69.24 లక్షల విలువైన స్లీప్ వెల్ అగరుబత్తీల విక్రయాలు నిలుపుదల చేశారు. స్లీప్‌వెల్ అగరుబత్తీల్లో మేపర్ ఫ్లూత్రీన్ అనే పురుగు మందు అవశేషాలు ఉన్నట్లు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ తేల్చిందని ఏడీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కంపెనీ అగరుబత్తీలు పొగ పీల్చడం వల్ల శ్వాస కోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఆదేశాల తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. నగరంలో ముగ్గురు స్టాకిస్టుల గోడౌన్‌లు తనిఖీ చేసినట్లు తెలిపారు. స్లీప్‌వెల్ అగరుబత్తీలు స్టాక్ పెట్టి విక్రయించే వారిపై క్రిమి సంహారక చట్టం, సంహారక రూల్ ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తప్పిపోయిన నాలుగేళ్ల చిన్నారి క్షేమం


