కృష్ణా జిల్లా ప్రత్యేకాధికారిగా అమ్రాపాలి
చిలకలపూడి(మచిలీ పట్నం): మోంథా తుపాను పరిశీలన కృష్ణా జిల్లా ప్రత్యేకాధికారిగా కె.అమ్రాపాలిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రానున్న మూడు రోజుల్లో తుపాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు, గాలులు వీయనున్న నేపథ్యంలో ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం జరగ కుండా, అధికారులను అప్రమత్తం చేసేందుకు జిల్లాకు ప్రత్యేకాధికారిగా ఆమెను నియమించారు. అమ్రాపాలి సోమవారం కలెక్టరేట్‌కు వస్తారని అధికారులు తెలిపారు.
కూచిపూడి(మొవ్వ): పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీసిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాపీఠంలో 2025–26 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పీఠం ప్రధానాచార్యుడు డాక్టర్ ఎం.శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. కూచిపూడి నాట్యంలో ఎంపీఏ (మాస్టర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్), సర్టిఫికెట్ కోర్సు, డిప్లమో, యక్ష గానం, సాత్విక అభినయం కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు ఫీజు రూ.500 చెల్లించాలని పేర్కొన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను నవంబర్ 15వ తేదీలోగా సెంట్రల్ అడ్మి షన్స్ కమిటీ కన్వీనర్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, బొమ్మూరు, రాజమహేంద్రవరం–533124 చిరునామాకు పంపించా లని సూచించారు. రూ.200 ఆలస్య రుసుంతో 20వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. మరిన్ని వివరాలకు 94413 70591 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
విజయవాడ కల్చరల్: తెలుగు సినిమా పాటకు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చిన రచయితలు సదా స్మరణీయులని మధువని సాంస్కృతిక సేవా సంస్థ వ్యవస్థాపకుడు వి.మధుబాబు అన్నారు. మధువని సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నగరానిచెందిన సాంస్కృతిక కళా సంస్థల సహకారంతో గాంధీనగర్‌లోకి కౌతా పూర్ణానందం కళావేదికపై ఆదివారం తెలుగు సినిమా 94 సంవత్సరాల విజయోత్సవ సభ, సినీ సంగీత విభావరి జరిగాయి. మధుబాబు మాట్లాడుతూ.. ఘంటసాల వెంకటేశ్వరరావు, బాలు వంటి గాయకులు, మహాకవి శ్రీశ్రీ, దేవులపల్లి కృష్ణశాస్త్రి, వేటూరి, సినారే, సిరివెన్నెల, చంద్రబోస్ వంటి రచయితలు తెలుగు సిని మాలో సాహిత్య సృష్టితోపాటు అంతర్జాతీయ స్థాయిలో జయకేతనం ఎగరవేసినట్లు పేర్కొన్నారు. మధువని వ్యవస్థాపకుడు మధుబాబును ఆత్మీయంగా సత్కరించారు. గాయనీ గాయకులు పి.కృష్ణారావు, శివప్రసాద్, ఎస్.సత్యనారాయణ, కె.వై.కృపావరం, ఎ.రాఘవ, అన్నపూర్ణ, సుభాషిణి, మల్లీశ్వరి పలు చిత్రగీతాలను మధురంగా ఆలపించారు.
ఘంటసాల: వ్యవసాయ రంగంలో విశేష సేవలందించడంతో పాటు పరిశోధన స్థానాల్లో సత్ఫలితాలు సాధించిన ఘంటసాల వ్యవసాయ పరిశోధనా స్థానం, ఉయ్యూరు చెరుకు పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త, హెడ్ డాక్టర్ వి.సత్యప్రియ లలిత ఆదివారం పద్మశ్రీ ఐ.వి.సుబ్బారావు రైతు నేస్తం పురస్కారం అందు కున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్య ప్రియలలిత మాట్లాడుతూ.. రైతు నేస్తం పత్రిక, ముప్పవరపు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అందిస్తున్న వివిధ పురస్కారాల్లో భాగంగా శాస్త్రవేత్తల విభాగంలో తాను ఎంపికయ్యానని పేర్కొన్నారు. హైదరాబాద్ ముచ్చింతల్‌లోని స్వర్ణ భారత్ ట్రస్టు తరఫున జరిగిన కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదగా పురస్కారం అందుకున్నానని తెలిపారు. సత్య ప్రియలలితను పలువురు అభినందించారు.
కృష్ణా జిల్లా ప్రత్యేకాధికారిగా అమ్రాపాలి


