ఓంకారేశ్వరునికి నాగాభరణం సమర్పణ
నందిగామరూరల్: గ్రామీణ ప్రాంత ఆలయాల అభివృద్ధికి దాతలు సహకరించాలని ఆలయ ధర్మకర్త గరికపాటి భగవంత్ తెలిపారు. మండలంలోని అంబారుపేట గ్రామంలో వేంచేసియున్న పార్వతీ సహిత ఓంకారేశ్వర స్వామికి చవట నాగరవితేజ రూ.1.50 లక్షల విలువ చేసే వెండి నాగాభరణాన్ని ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తిక మాసోత్సవాల్లో స్వామి వారికి నాగభరణం అందించటం అబినందనీయమని చెప్పారు. ముఖ్యంగా దాతలు ముందుకు వచ్చి ఆలయాల అభివృద్ధికి తమ వంతుగా సహకరించాలని కోరారు. అనంతరం నాగభరణాన్ని అర్చకులు సంప్రోక్షణ చేసి స్వామి వారికి అలంకరించారు. దాత కుటుంబ సభ్యులను స్వామి వారి శేష వస్త్రం, ప్రసాదాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు చవట వెంకటకృష్ణ, పుష్పావతి తదితరులు పాల్గొన్నారు.
పభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఆత్కూరు(గన్నవరం):ఓ యువకుడు ప్రమాదవశాత్తు ఏలూరు కాలువలో జారిపడి మృతి చెందిన సంఘటన ఉంగుటూరు మండలం ఆత్కూరులో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం...ఆత్కూరు గ్రామానికి చెందిన వేమూల నరేష్(20) విజయవాడలో ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. గ్రామ శివారులోని ఏలూరు కాలువలో ద్విచక్ర వాహనం కడిగేందుకు వెళ్లాడు. కాలువలోకి దిగిన నరేష్ ప్రమాదవశాత్తూ కాలుజారి లోతులోకి వెళ్లడంతో నీటి మునిగి మృతి చెందాడు. ఈ ఘటనపై ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు సంతానంలో చిన్నవాడైన నరేష్ అకాల మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. తొలుత ప్రభుత్వ ఆస్పత్రిలో సమయాభావం కావడంతో పోస్టుమార్టం చేసేందుకు వైద్యులు నిరాకరించారు. దీంతో ఆస్పత్రి వద్ద మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. చివరికి పోలీసులు జోక్యంతో వైద్యులు పోస్టుమార్టం పూర్తిచేయడంతో మృతదేహాన్ని అప్పగించారు.
ముగిసిన ఎస్‌జీఎఫ్ టేబుల్ టెన్నిస్ టోర్నీ
గోపాలపట్నం: స్థానిక ఇండోర్ స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన టేబుల్ టెన్నిస్ పోటీలు ఆదివారం ముగిశాయి. అండర్–14, అండర్–17, అండర్–19 విభాగాల్లో బాలురు, బాలికల జట్ల మధ్య జరిగిన ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు.
విభాగాల వారీగా విజేతలు వీరే..
అండర్–14 విభాగం: బాలుర విభాగంలో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. బాలికల విభాగంలో అనంతపురం జిల్లా ప్రథమ స్థానాన్ని, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాలను దక్కించుకున్నాయి.
అండర్–17 విభాగం: బాలుర విభాగంలో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. బాలికల విభాగంలో విశాఖపట్నం జిల్లా ప్రథమ స్థానాన్ని, అనంతపురం, కృష్ణా జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాలను దక్కించుకున్నాయి.
అండర్–19 విభాగం: బాలుర విభాగంలో విశాఖపట్నం జిల్లా ప్రథమ స్థానంలో, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. బాలికల విభాగంలో కృష్ణా జిల్లా ప్రథమ స్థానాన్ని, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాలను దక్కించుకున్నాయి. విజేతలకు అధికారులు, కోచ్‌లు, ఉపాధ్యాయులు అభినందించారు.
ఓంకారేశ్వరునికి నాగాభరణం సమర్పణ


