సీఎం చేతికి చిన్ని చిట్టా | - | Sakshi
Sakshi News home page

సీఎం చేతికి చిన్ని చిట్టా

Oct 26 2025 6:57 AM | Updated on Oct 26 2025 6:57 AM

సీఎం

సీఎం చేతికి చిన్ని చిట్టా

ఘనంగా నాగులచవితి వేడుక ● రెండు రోజుల కిందట తిరువూరులో ఎమ్మెల్యే కొలికిపూడి ఇంటిచుట్టూ గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌లను పోగేసి పెద్దెత్తున డీజే సౌండ్‌తో వాహనాన్ని తిప్పడం, రెచ్చగొట్టేలా ఎంపీ బృందం వ్యవహరించడాన్ని పార్టీ అధ్యక్షుడు పల్లా, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తదితరుల దృష్టికి కొలికిపూడి తీసుకెళ్లారు. ఆ వీడియోలు చంద్రబాబు దృష్టికి వెళ్లాయి. ఈ అంశం మీడియాలోనూ ప్రస్తావనకు వచ్చింది. ● హైదరాబాద్‌లోని ప్రగతినగర్‌లో ప్రీలాంచ్‌ పేరిట మోసాలు జరిగాయని, దీనిపై డబ్బులు ముందుగా చెల్లించిన వారు నవంబర్‌ రెండో తేదీ ఆందోళనకు దిగడంతో పాటు మీడియాకు ఎక్కనున్నారనే సమాచారాన్ని చేరవేశారు. దిండిగల్‌, జూబ్లీహిల్స్‌లోనూ భూ వ్యవహారాలు వివాదాస్పదంగా మారాయని గుర్తు చేస్తున్నారు. ● విజయవాడ, హైదరాబాద్‌తోపాటు తెలంగాణ మాజీ మంత్రి సహకారంతో కోదాడ పరిసరాల్లో ఎంపీ పేరిట పేకాట డెన్‌లు నిర్వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ● ఢిల్లీలో ఎంపీలను ఓ చోట చేర్చి పేకాట ఆడించారనే వ్యవహారాన్ని సీఎం దృష్టికి ఎన్‌డీఏలోని ఉన్నతస్థాయి నేతలు తీసుకొచ్చారని, దాదాపు నాలుగు నెలల నుంచి కేశినేని చిన్నిని తన పర్యటన సమయంలో చంద్రబాబు దూరంగా ఉంచుతున్నారని ముఖ్య నాయకుడు ఒకరు గుర్తు చేశారు. ● అమెరికాలో తమ కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగాలు చేస్తున్న వారికి సక్రమంగా జీతాలు చెల్లించడంలేదని ఎంపీ కేశినేని చిన్ని బృందంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ● జిల్లాలో రేషన్‌ మాఫియా డాన్‌ కుమారుడిని ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ అండర్‌ 14లో టీంలోకి తీసుకుంటున్నారని, దీనిపై ఇతర క్రీడాకారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని ఫిర్యాదులు వెళ్లాయి.

ఢిల్లీ, హైదరాబాద్‌, అమెరికాల నుంచి ఫిర్యాదులు

పొలిట్‌బ్యూరో సభ్యుల నుంచి నిర్ధిష్ట సమాచారం

కొలికిపూడి, కేశినేని చిన్ని రగడపై ఆరా

పరిశీలించి నిర్ధారించాలని బాబు సూచన

కమిటీ వేస్తాం

గండిపేటకు వెళ్లి చూసిరా...

ఘనంగా నాగులచవితి వేడుక
ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా శనివారం నాగులచవితి వేడుక ఘనంగా జరిగింది. వేకువ జాము నుంచే పుట్టల వద్ద భక్తులు బారులు తీరారు. పుట్టలో పాలుపోసి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి మొక్కుబడులు చెల్లించారు. మోపిదేవిలోని ప్రసిద్ధ శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం, పెనమలూరు మండలం చోడవరంలో వేంచేసిన శ్రీ లక్ష్మీనారాయణ సహిత శ్రీనాగేంద్ర స్వామివారి దేవస్థానం భక్తులతో పోటెత్తాయి. సాయంత్రం ప్రజలు బాణసంచా కాల్చి సందడిచేశారు. – సాక్షి నెట్‌వర్క్‌

సాక్షి, ప్రత్యేక ప్రతినిఽధి: ‘విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని), తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుల మధ్య ఆ రచ్చ ఏంటి? పార్టీ పరువు బజారున పడటం లేదా? వారు ఎందుకింత రోడ్డుపైకి ఈడుస్తున్నారు? ఇంత దారుణమైన పరిస్థితులు మరెక్కడైనా ఉన్నాయా? అలా నేరుగా మీడియాకు ఎక్కడం ఏంటి? పార్టీ అధిష్ఠానం, కేంద్ర కార్యాలయం ఉన్న అమరావతిలోనే ఈ దుస్థితి నెలకొని ఉంటే రాష్ట్రమంతా ఎలాంటి సంకేతాలు వెళతాయి? ప్రజాప్రతినిధులపైన, నాయకులపైన పార్టీకి ఏమాత్రం పట్టులేదని రూఢీ కావడం లేదా? ద్వితీయశ్రేణి నాయకత్వం, కార్యకర్తలు ఏమనుకుంటున్నారో అంచనాకు అందడం లేదా? మీరంతా కేంద్ర కార్యాలయంలో ఉండి ఏం చేస్తున్నారు? ఇంతలా అవుతున్నా ఎందుకు నా దృష్టికి తీసుకురాలేదు?’ అని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యులపై తీవ్రస్థాయిలో మండిపడినట్లు తెలిసింది. పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పొలిట్‌బ్యూరో సభ్యులతో పాటు తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుతోనూ దుబాయ్‌ నుంచి మాట్లాడినట్లు విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్యే, ఎంపీల గురించి తాజా సమాచారం రావడంతో వాటన్నింటిపై విచారించి వాస్తవాలు తెలియజేయాలని సంబంధితులను ఆదేశించినట్లు తెలిసింది. తిరువూరులో ఎమ్మెల్యే వ్యవహారాలపై ఫిర్యాదులు అందగా ఎంపీ కేశినేని చిన్నిపై ఆరోపణల చిట్టా చాంతాడంత చంద్రబాబు చేతికి వెళ్లిందని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ఇసుక, గ్రావెల్‌, నాటుసారా, గంజాయి అమ్మకాలు తదితరాల గురించి నేతలిరువురు పరస్పరం ఆరోపణలు గుప్పించుకోవడం, వారి ముఖ్య అనుచరులు వాటిని సవివరంగా ఏకరువు పెట్టడం బహిరంగ రహస్యమే.

విజయవాడలో శనివారం జరిగిన ఉమ్మడి కృష్ణా జిల్లా కూటమి సమన్వయ కమిటీ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనగా అందులోనూ చిన్ని, కొలికిపూడి వ్యవహారంపై చర్చ వచ్చింది. ఈ సమావేశంలోనూ వీరిద్దరూ ఒకరిపై ఒకరు పరస్పరం ఆరోపణలు చేసుకున్నట్లు టీడీపీ నేతల ద్వారా తెలిసింది. వీరి వ్యవహారంపై ఒక కమిటీని వేస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర మీడియాకు తెలిపారు.

‘నువ్వేదో సర్వీస్‌ ఓరియంటెడ్‌ అనుకున్నా. ఇంత కమర్షియల్‌ అని అనుకోలేదు. సర్వీస్‌ అంటే ఏంటో గండిపేటకు వెళ్లి ఎన్టీఆర్‌ ట్రస్టు చేస్తున్న సేవల గురించి తెలుసుకో. సేవ ఎలా చేయాలో, ఏం చేయాలో తెలిసొస్తుంది..’ అని ఎంపీ కేశినేని చిన్నికి చంద్ర బాబు విజయవాడలో ఓ సందర్భంలో హితవు చెప్పారని పార్టీ సీనియర్‌ నాయకుడు ఒకరు ‘సాక్షి’కి వివరించారు.

సీఎం చేతికి చిన్ని చిట్టా 1
1/2

సీఎం చేతికి చిన్ని చిట్టా

సీఎం చేతికి చిన్ని చిట్టా 2
2/2

సీఎం చేతికి చిన్ని చిట్టా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement