● రహదారి ఇలా.. రాకపోకలు ఎలా?
విస్సన్నపేట నుంచి ఎ.కొండూరు వెళ్లే రోడ్డుపై భారీ గుంతలు పడ్డాయి. చిన్నపాటి వర్షానికి సైతం ఈ గుంతల్లోకి నీరు చేరుతోంది. పలు విద్యా సంస్థలు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ట్రైబల్ బాలుర గురుకుల పాఠశాలతో పాటు ఆస్పత్రులు, కనకదుర్గ అమ్మవారి దేవస్థానానికి వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం. గుంతల కారణంగా వాహన చోదకులు, పాదచారులు ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. పలువురు వాహనచోదకులు ప్రమాదాల బారిన పడ్డారు. అధికారులు స్పందించి రహదారికి మర్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.
–విస్సన్నపేట


