సైకిల్‌పై విధులకు హాజరైన కృష్ణా కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

సైకిల్‌పై విధులకు హాజరైన కృష్ణా కలెక్టర్‌

Oct 26 2025 6:57 AM | Updated on Oct 26 2025 6:57 AM

సైకిల

సైకిల్‌పై విధులకు హాజరైన కృష్ణా కలెక్టర్‌

చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా కలెక్టర్‌ డి.కె.బాలాజీ శనివారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు సైకిల్‌పై వచ్చి విధులకు హాజరయ్యారు. శబ్ద, వాయు కాలుష్యం నివారణలో భాగంగా సైకిల్‌పై లేదా నడక మార్గంలో ప్రతి ఒక్కరూ ఒక రోజైనా విధులకు హాజరు కావాలని ఆయన ఇటీవల ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన సైకిల్‌పై విధులకు హాజరయ్యారు.

విద్యాసంస్థలకు

మూడు రోజులు సెలవులు

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్‌ జిల్లాలో మోంథా తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ నెల 27, 28, 29 తేదీల్లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లుగా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ శనివారం తెలిపారు. తుపానులో ప్రాణ నష్టం నివారించే ఉద్దేశంతో జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఇతర విద్యాసంస్థలు అన్నింటికి మూడు రోజులపాటు సెలవులు ప్రకటిస్తున్నట్లుగా పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలలోని విద్యార్థులందరూ ఆదివారం సాయంత్రంలోగా తమ ఇళ్లకు చేరుకునే విధంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ ఆదేశాలు క్షేత్రస్థాయిలో సజావుగా అమలయ్యే విధంగా జిల్లా విద్యాధికారి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

విలేజ్‌ క్లినిక్‌లలో ఆయుర్వేద గ్రాడ్యుయేట్లను నియమించండి

లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లలో ఆయుర్వేద గ్రాడ్యుయేట్లను నియమించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మెడికల్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌, నేషనల్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ను శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు. క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ , కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేద వైద్యులకు ఉద్దేశించి 58 సర్జరీలను అనుమతిస్తూ ప్రత్యేక జీఓ ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఇండియన్‌ సిస్టం ఆఫ్‌ మెడిసిన్‌కి పాలక మండలి ఏర్పాటు చేయాలని, ఆయుష్‌ డిపార్ట్‌మెంట్‌లో రెగ్యులర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయాలని విన్నవించారు. డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలకు స్థలం ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యులకు డీడీఓ పవర్స్‌ మంజూరు చేయాలనే అంశాలను మంత్రికి వివరించినట్లు అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు. ఆయా అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఏపీ ప్రభుత్వ మెడికల్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ టి.బుల్లయ్య తెలిపారు. మంత్రిని కలిసి వారిలో నేషనల్‌ మెడికల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ వేముల భాను ప్రకాశ్‌, డాక్టర్‌ వి.శ్రీధర్‌, డాక్టర్‌ రాజ్‌కమలాకర్‌, డాక్టర్‌ శ్రీనివాసరావు, డాక్టర్‌ జి.చినరాజు తదితరులు పాల్గొన్నారు.

డెంగీతో సీఆర్‌పీ మృతి

పాయకాపురం(విజయవాడరూరల్‌): డెంగీతో వారం రోజులుగా బాధ పడుతున్న కమ్యూనిటీ రిసోర్సు పర్సన్‌ (సీఆర్‌పీ) వి.శివదుర్గ(36) శనివారం ఉదయం మరణించారు. నగరంలోని 61వ డివిజన్‌ ప్రశాంతి నగర్‌లో నివసిస్తున్న శివదుర్గ సీఆర్‌పీగా విజయవాడ రూరల్‌ మండలం రామవరప్పాడు సెక్టార్‌లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారం రోజుల క్రితం జ్వరం రాగా వైద్య పరీక్షలు చేసిన వైద్యులు డెంగీ అని నిర్ధారించారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలి భర్త రాజారావు నార్త్‌ మండలంలో సీఆర్‌పీగా ఉద్యోగ బాధ్యతలు నిర్వ హిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు. సీఆర్‌పీ మృతి చెందినట్లు సమాచారం అందుకున్న విజయవాడ రూరల్‌ మండలం విద్యాశాఖాధికారులు ఎ.వెంకటరత్నం, ఎ.సూరిబాబు మండల సీఆర్‌పీలతో కలసి వెళ్లి ఆమె భౌతిక కాయం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.

సైకిల్‌పై విధులకు హాజరైన కృష్ణా కలెక్టర్‌ 1
1/2

సైకిల్‌పై విధులకు హాజరైన కృష్ణా కలెక్టర్‌

సైకిల్‌పై విధులకు హాజరైన కృష్ణా కలెక్టర్‌ 2
2/2

సైకిల్‌పై విధులకు హాజరైన కృష్ణా కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement