సిబ్బంది కృషి వల్లే సాధ్యమైంది
లక్ష్మీపురం(గుంటూరు వె్‌స్ట్) : గుంటూరు కృష్ణ కెనాల్ జంక్షన్ వద్ద కొన్ని రోజులుగా వరుసగా రైళ్లలో చైన్ స్నాచింగ్ చేస్తూ పలు రాష్ట్రాల పోలీసులకు సవాల్‌గా మారిన సంజయ్ రాయ్, అతని గ్యాంగ్ సభ్యులను గుంటూరు రైల్వే జీఆర్పీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. రైల్వే జీఆర్పీ డీఎస్పీ అక్కేశ్వరరావు, సీఐ అంజిబాబు తెలిపిన వివరాల ప్రకారం... కేసులోని నిందితులు పలు రాష్ట్రాల మధ్య రైళ్లలో తిరుగుతూ నేరాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయా రాష్ట్రాలలో ఈ గ్యాంగ్‌పై 50కిపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ నెల 4న గుంటూరు రైల్వే స్టేషన్‌లో ముగ్గురు పారిపోయేందుకు యత్నించగా, అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకడైన హరియాణాకు చెందిన సతేందర్ కుమార్ జవాన్‌గా చేసి హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. మిగతావారు రాజస్థాన్‌కు చెందిన సతీష్ గుజ్జర్ అలియాస్ గుజ్జర్, రవికుమార్ అలియాస్ ప్రజాపతి అని తెలిసింది. రూ.3.40 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. వీరి ముఠా నాయకుడు సంజయ్ రాయ్ అని దర్యాప్తులో తేలింది. అస్సోంలో స్థానిక పోలీసుల సహాయంతో అతడిని బుధవారం అరెస్టు చేశారు. ముఠాలో 10 మంది ఉన్నారని, గన్నవరం, విశాఖపట్నం, సికింద్రాబాద్, చైన్నెకి విమానాల్లో వచ్చి చోరీల తర్వాత పారిపోతున్నట్లు వెల్లడైంది. కేసులో ప్రతిభ చాటిన సీఐ జి.అంజిబాబు, ఆర్పీఎఫ్ సీఐ వీరబాబు, జీఆర్పీ ఎస్సై షేక్ మహబూబ్ సుభాని, ఆర్పీఎఫ్ ఎస్‌ఐ శ్రీనివాసరెడ్డి, క్రైం పార్టీలను డీఎస్పీ అభినందించారు.
బస్టాండ్(విజయవాడపశ్చిమ): స్వీపింగ్, టాయిలెట్ సిబ్బంది కృషి ఫలితంగానే పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌కు రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛ సేవా అవార్డు వచ్చినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు పేర్కొన్నారు. బుధవారం ఆర్టీసీ హౌస్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఇటీవల సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అందుకున్న అవార్డును ద్వారకాతిరుమలరావు సిబ్బందికి అందజేసి అభినందనలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఇటువంటి అవార్డులు పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌కు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. బస్‌స్టేషన్ స్వీపింగ్, టాయిలెట్ సిబ్బందికి బహుమతులను అందజేశారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌లు రవివర్మ, అప్పల రాజు, చెంగల్‌రెడ్డి, విజయరత్నం, డెప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ సూర్యపవన్‌కుమార్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ బి.శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు.
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్