కృష్ణానదికి మళ్లీ వరద
కృష్ణానదికి మళ్లీ వరద
పెనమలూరు:కృష్ణా నదికి మళ్లీ వరద వస్తుంది. దీంతో కరకట్ట దిగువున ఉన్న నివాసితులు ఆందోళన చెందుతున్నారు. ఈ సీజన్‌లో కృష్ణానదికి పలుమార్లు వరద వచ్చింది. అయితే వరద ఉధృతి తక్కువగా ఉండటంతో కరకట్ట దిగువున ఉన్న ఇళ్లల్లోకి నీరు రాలేదు. ఒక దశలో వరద నీరు వస్తుందని అధికారులు నివాసితులను అప్రమత్తం చేశారు. అయితే కృష్ణానది శాంతించటంతో కరకట్ట దిగువున ఉండే నివాసితులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా మరలా వరద రావటంతో ఈ సారి ఏమౌతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని యనమలకుదురు, పెదపులిపాక, చోడవరం ఘాట్‌లకు వరద నీరు చేరుకుంది. కట్ట అంచువరకు వరద నీరు వచ్చింది. పశువుల కాపర్లను, స్థానికులను నదిలోకి వెళ్ల వద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బాలికపై బ్లేడుతో దాడి
ఆందోళనలో కరకట్ట వాసులు
కంచికచర్ల: బాలికపై బ్లేడ్‌తో దాడి చేసి గాయపర్చిన ఘటనకు సంబందించి ఓ యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పి.విశ్వనాఽథ్ ఆదివారం తెలిపారు. అంబేద్కర్‌నగర్‌కు చెందిన బాలిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతుంది. అదే కాలనీకి చెందిన యువకుడు బాలిక ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో శనివారం రాత్రి వెళ్లి బ్లేడుతో దాడి చేసి గాయపర్చాడు. ఆ యువకుడు పాఠశాలలో బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని బాధితురాలు తెలిపింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.