
విజయవాడ సిటీ
న్యూస్‌రీల్
దుర్గగుడిపై నేడు
ఎన్టీఆర్ జిల్లా
సోమవారం శ్రీ 22 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
I
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దసరా ఉత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారవేదిక (పీజీఆర్‌ఎస్)ను రద్దు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదివారం తెలిపారు. ఈ నెల 29వ తేదీన కూడా ఈ కార్యక్రమం జరగదని పేర్కొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు.
కాంతుల కనకధార.. విద్యుత్‌దీపాలంకరణలతో ధగధగలాడుతున్న ఇంద్రకీలార్రి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం శ్రీ దేవీ శరన్నవరాత్రి (దసరా) మహోత్సవాలకు ముస్తాబైంది. ఉత్సవాల తొలి రోజైన సోమవారం శ్రీబాలా త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం, విశేష అలంకరణ, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం ఎనిమిది గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. తొలుత అమ్మవారి ప్రధాన ఆలయంలోని ఉత్సవమూర్తిని మహా మండపం ఆరో అంతస్తుకు ఊరేగింపుగా తీసుకొస్తారు. అక్కడ ఉత్సవమూర్తిని ప్రతిష్టించి పూజా కార్యక్రమాల నిర్వహణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం అమ్మవారికి నిర్వహించే ప్రత్యేక కుంకుమార్చనలు, చండీయాగం, శ్రీచక్ర నవార్చనలు మొదలవుతాయి. ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో సాయంత్రం వేళ అమ్మవారికి పంచహారతుల సేవ సమయంలో క్యూలైన్లు యథావిధిగా నడిపించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశతో పాటు దేవదాయ శాఖ అధికారులు నిర్ణయించారు. అంతరాలయంలో పంచహారతులు జరుగుతుండగానే రూ.300, రూ.100 క్యూలైన్‌తో పాటు సర్వ దర్శనం క్యూలైన్లు నడుస్తూ ఉంటాయి. ఏర్పాట్లను దేవదాయ శాఖ, దుర్గగుడి అధికారులు, పోలీసు, రెవెన్యూ అధికారులు ఆదివారం మరో మారు తనిఖీ చేశారు.
తెల్లవారుజామున 3 గంటలకు అమ్మవారికి సుప్రభాత సేవ
తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం
శ్రీబాలా త్రిపురసుందరీదేవిగా అలంకరణ, పూజా కార్యక్రమాలు, బాల భోగ సమర్పణ
ఉదయం 8 గంటల నుంచి అమ్మవారి దర్శనం
ఉదయం 9 గంటలకు కలశస్థాపన
ఉదయం 9 గంటలకు ప్రత్యేక శ్రీచక్రనవార్చన
ఉదయం 9 గంటలకు ప్రత్యేక చండీయాగం
ఉదయం 10 గంటలకు ప్రత్యేక కుంకుమార్చన
సాయంత్రం 4 గంటలకు శ్రీగంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్ల నగరోత్సవం
సాయంత్రం 6 గంటలకు పంచ హారతుల సేవ
రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం
దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీపీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ