
విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ):దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో డివిజన్ వ్యాప్తంగా రైల్వే ఉద్యోగుల పిల్లలకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. ఈ నెల 14, 21 తేదీల్లో విజయవాడ, సామర్లకోట, తుని, ఏలూరు, రాయనపాడు, తెనాలి, ఒంగోలు, భీమవరం, మచిలీపట్నంలో నిర్వహించిన పోటీల్లో 400 మంది ఉద్యోగుల పిల్లలు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయవాడ డివిజన్ ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైషన్ అధ్యక్షురాలు వర్షా సోనాకియా మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పిల్లల్లోని ప్రతిభ, నైపుణ్యాలు మెరుగుపడతాయని చెప్పారు. అలానే కుటుంబ బంధాలు బలోపేతం అవుతాయని తెలిపారు. అనంతరం పోటీల్లో విజేతలకు రైల్వే అధికారుల చేతుల మీదుగా బహుమతులు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ స్వప్న వరుణ్, జాయింట్ సెక్రటరీ వాసంతిక, కృష్ణ చైతన్య, రమ్య తదితరులు పాల్గొన్నారు.