
సమాచార శాఖ ఏడీకి కలెక్టర్ అభినందనలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర సమాచార కేంద్రం విజయవాడ కార్యాలయంలో సహాయ సంచాలకుడిగా ఉద్యోగోన్నతి పొందిన ఎన్టీఆర్ జిల్లా పౌర సంబంధాల అధికారి ఎస్.వి.మోహన్‌రావుకు కలెక్టర్ జి.లక్ష్మీశ అభినందనలు తెలిపి ఘనంగా సత్కరించారు. సమాచార పౌర సంబంధాల శాఖ విజయవాడ సహాయ సంచాలకుల కార్యాలయంలో సహాయ సంచాలకుడిగా ఉద్యోగో న్నతి పొందిన మోహన్‌రావును బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం అభినందనలు తెలిపి సత్కరించారు. 2008లో సహాయ పౌర సంబంధాల అధికారి (ఏపీఆర్వో)గా విజయవాడ రాష్ట్ర సమాచార కేంద్రంలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన ఎస్.వి.మోహన్‌రావు విజయవాడ డివి జనల్ పీఆర్వోగా, డీపీఆర్వోగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం విజయవాడ సహాయ సంచాలకుడిగా ఉద్యోగోన్నతి పొందారు. ఉద్యోగోన్నతి పొంది నప్పటికీ జిల్లాకు సంబంధించిన కార్యక్రమాలకు కూడా కవరేజ్ చేస్తూ మీడియా ప్రతినిధులు, అధికారులను మరింత సమన్వయం చేసుకోవాలని కోరారు. దసరా మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ డీపీఆర్వోగా బాధ్యతలు చేపట్టిన వై.బాలకృష్ణ కలెక్టర్ లక్ష్మీశను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో డీఐపీఆర్వో కె.వి.రమణరావు, ఇన్‌చార్జ్ డీపీఆర్వో వై.బాలకృష్ణ, డివిజనల్ పీఆర్వో కె.రవి, ఏవీఎస్ వి.వి.ప్రసాద్, సిబ్బంది కె.గంగా భవాని, వై.గౌరి మహేష్ తదితరులు పాల్గొన్నారు.