
వేద పాఠశాల ప్రారంభం
తాడేపల్లి(ఘంటసాల): కృష్ణాజిల్లా ఘంటసాల మండలం తాడేపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన శృతి భారతి వేద పాఠశాల, కంప్యూటర్ల గదిని ఏర్పేడు వ్యాసాశ్రమ పీఠాధిపతి పరిపూర్ణానందగిరి స్వామిజీ, అసంగానందగిరి స్వామిజీలు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామీజీలు మాట్లాడుతూ.. ఎన్నారై మూల్పూరి వెంకట్రావు–సావిత్రి దంపతుల చేయూతతో ఈ వేద పాఠశాల ఏర్పాటైందని చెప్పారు. తిరుపతికి చెందిన జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం డైరెక్టర్ జ్ఞానరంజన్ పాండా మాట్లాడుతూ వేద పాఠశాలో అక్టోబర్ 1 నుంచి రెండేళ్ల సంస్కృత కోర్సు తరగతులు ప్రారంభిస్తామన్నారు. ముందుగా స్వామీజీలు శ్రీ సద్గురు మళయాళ స్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో విశ్రాంత సంస్కృత ఉపాధ్యాయులు రంగాచార్యులు, పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు.