
పత్రికా స్వేచ్ఛను హరించడమే
సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు బనాయించి అణిచి వేస్తే తమను ప్రశ్నించేవాళ్లు ఉండరని కూటమి ప్రభుత్వం దుర్మార్గమైన అలోచన చేస్తుంది. పత్రికలపై, జర్నలిస్టులపై కేసులు బనాయించి కొత్త సంప్రదాయానికి ఈ ప్రభుత్వం తెరలేపింది. ప్రభుత్వాలు ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు. పత్రికా స్వేచ్ఛని హరిస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం తలెత్తుతుంది. కూటమి ప్రభుత్వం ఇకనైనా తమ తప్పును తెలుసుకొని అక్రమ కేసులపై దృష్టి వీడి, ప్రజా సమస్యలను పరిష్కరించాలి.
– నల్లగట్ల స్వామిదాస్,
వైఎస్సార్ సీపీ తిరువూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్