
కక్ష సాధింపు మానుకోవాలి
నిజాలను నిర్భయంగా రాసే సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేయించడం వంటి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. పత్రికా స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణపై దాడులు చేయడం అమానుషం. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం నిజాలు రాస్తే జీర్ణించుకోలేకపోతోంది. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై కేసులు పెట్టడం, విచారణ పేరుతో పోలీస్‌స్టేషన్‌కు పిలిపించడం సరికాదు. ప్రభుత్వ చర్యలను రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు.
– దేవినేని అవినాష్,
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు