
ఒక్క కట్ట కూడా ఇవ్వలేదు
చేవేండ్ర పీఏసీఎస్‌లో రూ.16 లక్షలు రుణం తీసుకున్నా. రుణం తీసుకున్న వారికే యూరియా కట్టలు ఇస్తామన్నారు. ఉదయమే వచ్చా. అయినా ఒక కట్ట కూడా ఇవ్వలేదు. ఇంత దారుణమైన పరిస్థితి ఎక్కడా చూడలేదు. నాకు, నా కుటుంబసభ్యులందరికీ కలిపి 15 ఎకరాలున్నాయి. యూరియా కొట్టకపోతే పంటకు బలం రాదు. బయట కొందామంటే గుళికలకు లింకు పెడుతున్నారు. ప్రస్తుతం గుళికలతో పని లేదు. యూరియా మాత్రమే కొట్టాలి కాబట్టి పీఏసీఎస్‌లో తీసుకువెళ్లడానికి వచ్చా.
-గంగుమోలు వెంకటేశ్వరరావు, రైతు,
మర్రిగుంట, చేవేండ్ర పంచాయతీ
●