
ఆవిష్కరణల్లో జిల్లాను నంబర్ వన్ చేద్దాం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్‌టీఐహెచ్), స్పోక్‌ల ద్వారా స్టార్టప్‌లకు కొత్త ఊపు రానుందని.. దీనిని సద్వినియోగం చేసుకుంటూ జిల్లాను ఆవిష్కరణల్లో నంబర్ వన్‌గా నిలిపేందుకు కృషి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో శుక్రవారం వివిధ స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్ లక్ష్మీశ జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతలకు, కొత్త ఆవిష్కరణలకు రాష్ట్రాన్ని వేదికగా తీర్చిదిద్దేందుకు అమరావతిలో రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నారన్నారు. దీనికి అనుసంధానంగా రాష్ట్రంలో అయిదు ప్రాంతాల్లో స్పోక్‌లను కేటాయించారని, ఎన్టీఆర్ జిల్లాకు ఒక స్పోక్‌ను వచ్చిందన్నారు.
ఇది ట్రయల్ రన్..
విజయవాడలోని ఎనికేపాడులో రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్, స్పోక్‌ను త్వరలోనే ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని.. ఈ నేపథ్యంలో సన్నద్ధతలో భాగంగా ట్రయల్‌రన్‌గా కలెక్టరేట్ ప్రాంగణంలో దాదాపు 62 స్టార్టప్‌లు తమ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, లిక్విడ్–సాలిడ్ వేస్ట్ రీసైకిలింగ్, డ్రోన్స్ యూజ్ కేసులు, అగ్రీ టెక్, ఎన్విరాన్ డిజిటల్ వంటి సొల్యూషన్స్‌ను ప్రదర్శించినట్లు వివరించారు. విద్యార్థులు, యువత కొత్త ఆలోచనలతో ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నారని, వీరికి అన్ని విధాలా ఆర్‌టీఐహెచ్ హబ్, స్పోక్‌ల ద్వారా మద్దతు లభిస్తుందన్నారు. చాలా తక్కువ ఖర్చులో అందరికీ అందుబాటులో ఉండే టెక్ సొల్యూషన్స్‌ను ప్రోత్సహించి.. వివిధ పథకాలను సద్వినియోగం చేసుకునేలా, సహాయసహకారాలు అందజేస్తామన్నారు. ఇప్పటికే కలెక్టరేట్‌లో ఇగ్నైట్ సెల్ ద్వారా వివిధ శాఖల పరిధిలో అందుబాటులో ఉన్న పథకాలు, వాటిని సద్వినియోగం చేసుకునేందుకు మార్గాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. వివిధ స్టార్టప్ సంస్థల ప్రతినిధులు, జిల్లా పరిశ్రమల అధికారి బి.సాంబయ్య, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ