
ఉపాధ్యాయులను మానసిక వేదనకు గురి చేయొద్దు
డీఈఓకు ఫ్యాఫ్టో వినతి
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఉపాధ్యాయు ల ముఖ ఆధారిత హాజరు విషయంలో వారిని మానసిక వేదనకు గురి చేయవద్దని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జిల్లా నేతలు డీఈవో సుబ్బారావుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయనను కలిసి వినతిపత్రాన్ని అందించారు. ఫ్యాప్టో ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ ఏ సుందరయ్య మాట్లాడుతూ జిల్లాలో టీచర్స్ ఫేషియల్ అటెండెన్స్ నాట్ మార్క్‌డ్ లిస్ట్‌ను ఉదయం తొమ్మిది గంటలకు విడుదల చేసి ఉపాధ్యాయులను మానసిక ఆందోళనకు గురి చేస్తున్నారన్నారు. సరైన నెట్ సౌకర్యం లేని చోట తొమ్మిది గంటలకి ముందు స్కూల్‌కి వచ్చినా గాని వివిధ కారణాలతో హాజరు పడకపోవడంతో నాట్ మార్క్‌డ్‌లిస్టు అని డీఈవో కార్యాలయం నుంచి తొమ్మిది గంటలకు లిస్ట్ పెట్టి జిల్లా అంతా వాట్సాప్ గ్రూప్‌లో ప్రతి రోజు వైరల్ చేస్తున్నారన్నారు. కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హాజరు వేయుటకు 10 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఉన్నాగాని జిల్లా తొమ్మిది గంటలకే విడుదల చేయడాన్ని తప్పు పట్టారు. 9.15 నిమిషాల తర్వాత లిస్ట్‌లు మాత్రమే విడుదల చేయాలని కోరారు. అదే విధంగా జిల్లాలో 2025 ఏప్రిల్ ఎస్‌ఎస్‌సీ పేపర్ల మూల్యాంకనం చేసిన ఉపాధ్యాయులకు నేటికీ పారితోషికం చెల్లించలేదని వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొంద రు ఎంఈవోలు డీడీఎస్‌లను సకాలంలో చేయటం లేదని చెప్పారు. సెక్రటరీ జనరల్ డాక్టర్ ఇంటి రాజు, వి.భిక్ష్మమయ్య, రాంబాబు నాయక్ సయ్యద్ ఖాసీం, సదారతుల్లా బేగ్ తదితరులు పాల్గొన్నారు.