
పోలీస్ గ్రీవెన్స్‌కు 62 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రజాసమస్యల సత్వర పరిష్కారం కోసం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి 62 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితులతో మాట్లాడి సమస్యల సత్వర పరిష్కారం కోసం ఆయా స్టేషన్‌ల ఎస్‌హెచ్‌ఓలకు తగిన ఆదేశాలు ఇచ్చారు. కాగా మొత్తం 62 ఫిర్యాదులు రాగా, వాటిలో భూ వివాదాలు, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలకు సంబంధించినవి 37, భార్యాభర్తలు, కుటుంబ కలహాలకు సంబంధించి 4, కొట్లాటకు సంబంధించి 3, వివిధ మోసాలపై 05, మహిళా సంబంధిత నేరాలపై 2, సైబర్ నేరాలపై 4, ఇతర చిన్న వివాదాల, సమస్యలపై 07 ఫిర్యాదులు అందాయి. డీసీపీ ఉదయరాణితో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొని ఫిర్యాదులు పరిష్కరించడంలో సహకారం అందించారు.