
ఆలయానికి కూరగాయలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శాకంబరీదేవి అలంకరణకు అవసరమైన కూరగాయలు, కాయగూరలు, పండ్లను దాతలు సమర్పించగా, వాటిని ఆలయానికి తరలించారు. ఆదివారం మహామండపం ఆరో అంతస్తులో భక్తులు సమర్పించిన కాయగూరలు, ఆకు కూరలు, పండ్లను ఈవో శీనానాయక్ పరిశీలించారు. 8వ తేదీ నుంచి మూడు రోజుల పాటు శాకంబరీదేవి ఉత్సవాలను నిర్వహించనున్నారు. భక్తులు, రైతులు, దాతలు దేవస్థానానికి సమర్పించిన కాయగూరలు, కూరగాయలను ఆలయ అలంకరణకు సిద్ధం చేయాలని ఏఈవో రమేష్‌బాబును ఈవో ఆదేశించారు. మరో వైపు ఆలయంతో పాటు ఆలయ ప్రాంగ ణంలోని ఉపాలయాలలో కూరగాయలను అలంకరించేందుకు అవసరమైన పనులను సిబ్బంది ఆదివారం నుంచి ప్రారంభించారు.
దుర్గమ్మ సేవలో డీజీపీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్‌కుమార్ గుప్తా దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన హరీష్‌కుమార్ గుప్తాను ఆలయ ఈవో శీనానాయక్ సాదరంగా స్వాగతం పలుకగా, అర్చకులు ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ ఈవో శీనానాయక్ డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువస్త్రాలను సమర్పించారు. డీజీపీ వెంట ఏడీసీపీ రామకృష్ణ, వెస్ట్ ఏసీపీ దుర్గారావు ఉన్నారు.
నేడు డాక్టర్స్ ట్రస్టు భవనం ప్రారంభోత్సవం
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రాంగణంలో రూ.1.50 కోట్లతో నిర్మించిన డాక్టర్స్ ట్రస్టు భవనాన్ని సోమవారం వెద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ప్రారంభించనున్నారు. కోవిడ్ సమయంలో అందించిన వైద్య సేవలకు గాను వైద్యులకు వచ్చిన ఆరోగ్యశ్రీ ఇన్‌సెంటివ్స్ రూ.78 లక్షలు, పలువురు వైద్యులు, దాతల ద్వారా నిధులను సమీకరించి రెండేళ్ల కిందట ఈ భవన జీ+2 అంతస్తుల్లో నిర్మాణాన్ని చేపట్టారు. ఈ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో డాక్టర్స్ క్యాంటీన్ ఏర్పాటు చేయనుండగా.. మొదటి, రెండు అంతస్తుల్లో రూమ్స్ ఏర్పాటు చేస్తారు. వైద్య కళాశాలలో నిర్వహించే పరీక్షలకు వచ్చే ఎగ్జామినర్స్, ఇన్‌స్పెక్షన్‌లకు వచ్చే వారు ఉండేలా ఈ రూమ్స్‌ను సిద్ధ చేయనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో వ్యవసాయశాఖ డైరెక్టర్ ఎస్. ఢిల్లీరావు, డీఎంఈ డీఎల్‌వీల్ నరసింహంలతో పాటు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు, సూపరింటెండెంట్ డాక్టర్ ఏ వేంకటేశ్వరరావు తదితరులు పాల్గొంటారు.
32మంది బేస్‌బాల్
క్రీడాకారులు ఎంపిక
నాగాయలంక: కృష్ణాజిల్లా బేస్‌బాల్ అసోసియేషన్‌లో ఆధ్వర్యంలో స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ గ్రౌండ్స్‌లో ఆదివారం నిర్వహించిన సీనియర్ బేస్‌బాల్ సెలక్షన్స్‌లో 32మంది ఎంపికయ్యారు. సెలక్షన్స్ కోసం జరిగిన పోటీలకు 200మంది క్రీడాకారులు హాజరుకాగా 16మంది బాలికలు, 16మంది బాలురు సెలెక్ట్ అయినట్లు అసోసియేషన్ కార్యదర్శి సరళ శ్రీనివాసరావు ప్రకటించారు. తొలుత ఈ పోటీలను ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ స్థానిక సబ్‌బ్రాంచి చైర్మన్ భోగాది శివవిష్ణుప్రసాద్ ప్రారంభించారు. ఫిజికల్ డైరెక్టర్‌లు గాజుల లక్ష్మీప్రసాద్, బడే వెంకటేశ్వరరావు, చిల్ల సుబ్బారావు, సనకా శ్రీకాంత్, బడే పాండురంగప్రసాద్, రేపల్లె శ్రీధర్ సెలక్షన్ కమిటీ సభ్యులుగా వ్యవహరించారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 12, 13, 14 తేదీలలో జరిగే రాష్ట్ర స్థాయి బేస్‌బాల్ పోటీలలో కృష్ణా జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని అసోసియేషన్ కార్యదర్శి చెప్పారు.

ఆలయానికి కూరగాయలు

ఆలయానికి కూరగాయలు