
విదేశీ వైద్య విద్యార్థుల సమస్యను వారంలో పరిష్కరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విదేశాల్లో వైద్య విద్య పూర్తిచేసుకున్న వైద్య విద్యార్థుల సమస్యను వారంలోగా పరిష్కరించాలని వైఎస్సార్ సీపీ డాక్టర్స్ వింగ్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ధర్నా చౌక్ వద్ద నిరసన తెలుపుతున్న విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లకు నాగ రాధాకృష్ణ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశీ వైద్య విద్య గ్రాడ్యుయేట్లకు శాశ్వత రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. ఇంటర్న్‌షిప్, క్లర్క్‌షిప్ కాలాలను శాసీ్త్రయంగా పొడిగించాలని డాక్టర్ రాధాకృష్ణ అన్నారు. గాయపడిన ఎఫ్‌ఎంఏలను ఆయన పరామర్శించారు. మహిళా వైద్యులపై పోలీసుల క్రూరత్వాన్ని ఖండించారు. అంతకు ముందు విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర వైద్య విద్యార్థుల శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. వైద్య విద్యార్థులు 13 నెలలుగా శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
వైఎస్సార్ సీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్