
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
పెడన: పట్టణంలో ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై పెడన పీఎస్‌లో ఆదివారం కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్ కరోజ్ జిల్లా బైగాం గ్రామానికి చెందిన రామ్‌తీథ్(35) రెండేళ్ల క్రితం పెడనకు వచ్చి పానీ పూరి బండి నడుపుతున్నారు. 21వ వార్డులోని అద్దె ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నాడు. అతనికి మూడు నెలల క్రితం కామెర్లు వచ్చాయి. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నాడు. మద్యం అలవాటున్న రామ్‌తీథ్ శనివారం ఇంట్లో పడిపోయాడు. ఆదివారం అతని బంధువులు నిడుమోలులో ఉంటూ పెడనకు వచ్చి రామ్‌తీథ్‌ను చూసి పెడన పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతని బావమరిది ఉమేష్‌చంద్ర ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సత్యనారాయణ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
ద్విచక్ర వాహన చోరీ నిందితుల అరెస్టు
సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): ఎస్‌ఎన్‌పురం పీఎస్ పరిధిలో ఇటీవల జరుగుతున్న వరుస ద్విచక్ర వాహన చోరీలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. నార్త్‌జోన్ ఏసీపీ స్రవంతిరాయ్ ఆదేశాల మేరకు ఎస్‌ఎన్‌పురం సీఐ ఎస్వీవీ లక్ష్మీనారాయణ, ఎస్‌ఐలు షబ్బీర్, ఎ. సౌజన్య ప్రత్యేక దర్యాప్తు చేశారు. సీసీ కెమేరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చోరీలు చేసిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చోరీలు చేసింది నగరంలోని పెజ్జోనిపేట, అల్లావుద్దీన్ వీధికి చెందిన సయ్యద్ సాజీజ్, స్థానికుడు ఖాన్ చాంద్‌ఖాన్‌లు స్నేహితులు. వ్యసనాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే ద్విచక్ర వాహనాలు చోరీ చేసినట్లు తెలిపారు. పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
గుంతలో పడి గాయపడిన నేవీ ఉద్యోగి మృతి
పెనమలూరు: కానూరులో బైక్‌పై వెళ్తూ రోడ్డుపై ఉన్న గుంతలో పడి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేవీ ఉద్యోగి మృతి చెందాడె, దీనిపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం తాతినేని సీతారామయ్య కుటుంబ సభ్యులతో గన్నవరం మండలం కేసరపల్లి ముస్తాబాద రోడ్డులోని జ్యుల్‌కౌంట్ అపార్టుమెంట్‌లో ఉంటున్నారు. అతనికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు తాతినేని కాత్యారావు(33) మర్చంట్ నేవీలో పని చేస్తాడు. ప్రసుత్తం సెలవుల్లో ఉండటంతో తండ్రి వద్దకు వచ్చాడు. ఈ నెల 20వ తేదీ కాత్యారావు బైక్‌పై విజయవాడకు వెళ్లి 21వ తేదీ ఉదయం 4.50 గంటలకు బైక్‌పై అత్తగారు ఉంటున్న ఎనికేపాడుకు బయలుదేరాడు. అతను బైక్‌పై కామయ్యతోపులో నుంచి కానూరు ప్రధాన రహదారిలోకి వచ్చాడు. ఆర్‌సీఎం చర్చి వద్ద ప్రధాన రహదారిపై పెద్ద గుంత ఉండటంతో కాత్యారావు పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న అతను శనివారం రాత్రి మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.