మోపిదేవి: స్థానిక మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి చెన్త్నెకు చెందిన బి. రంగరామానుజం రూ. 1,20,000 విలువుగల వెండి వస్తువులు సోమవారం బహూకరించారు. ఉదయం స్వామివార్లను దర్శించుకున్న అనంతరం 440 గ్రాముల వెండి చటారి, 532 గ్రాముల వెండి వేలాయుధం, 125 గ్రాముల వెండి చిన్నబిందెను స్వామివారికి కానుకగా ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావుకు అందజేశారు. అనంతరం దాత లను ఆలయ మర్యాదలతో సత్కరించారు.
నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళం..
సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన మాలంపాటి రామకృష్ణయ్య, సీతాలక్ష్మి దంపతులు రూ. లక్ష విరాళంగా సోమవారం సమర్పించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వీరు తొలుత స్వామివార్లను దర్శించుకున్న అనంతరం ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావుకు విరాళాన్ని అందజేశారు.
కార్తికేయునికి వెండి వస్తువులు బహూకరణ