భరోసాతో కోలాహలం | - | Sakshi
Sakshi News home page

భరోసాతో కోలాహలం

Jun 2 2023 1:46 AM | Updated on Jun 2 2023 1:46 AM

- - Sakshi

● వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ తొలి విడత సొమ్ము అందజేత ● ఈ ఏడాది తొలి విడతగా రూ.95.96 కోట్ల ఆర్థికసాయం ● కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెలంపల్లి, కలెక్టర్‌ ఢిల్లీరావు

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగుచేసుకుంటున్న రైతులతో పాటు కౌలు రైతులకు వ్యవసాయ పెట్టుబడులకు వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావు పేర్కొన్నారు. వ్యవ సాయ పెట్టుబడి, ఖర్చు భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది మొదటి విడతగా 1,27,954 మంది రైతులకు రూ.95.96 కోట్ల ఆర్థిక సాయాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేసిందన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో గురువారం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ రైతు భరోసా, ఇన్‌పుట్‌ సబ్సిడీ లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లో బటన్‌ నొక్కి నగదు జమ చేశారు. ఈ కార్యక్రమాన్ని నగరంలోని రైతు శిక్షణ కేంద్రం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా కలెక్టర్‌ ఢిల్లీరావు, పలువురు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి వీక్షించారు. అనంతరం జిల్లాకు చెందిన రైతులకు రైతు భరోసా చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఢిల్లీరావు మాట్లాడుతూ.. రైతు భరోసా కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.13,500 ఆర్థిక సహాయం అంది స్తామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ ఏడాది మొదటి విడత కింద 1,27,954 మంది రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో రూ.95.96 కోట్లు జమ చేశామన్నారు. 1,27,739 మంది రైతులు, కౌలు రైతులకు రూ.95.80 కోట్లు, అటవీ భూములను సాగు చేసు కుంటున్న 215 మంది రైతు కుటుంబాలకు రూ.16.125 లక్షల చొప్పున లబ్ధి చేకూరిందని వివరించారు. నాలుగేళ్లుగా రైతు భరోసా పథకం కింద రూ.7,500, పీఎం కిసాన్‌ పథకం ద్వారా రూ.6 వేల చొప్పున అర్హులైన రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో క్రమం తప్పకుండా నగదు జమచేస్తున్నా మని వివరించారు. ఇప్పటి వరకూ జిల్లాలో లబ్ధిదారులకు రూ.748.43 కోట్ల మేర లబ్ధి చేకూరిందని తెలిపారు.

రైతు సంక్షేమమే ధ్యేయం

విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వైఎస్సార్‌ రైతు భరోసా పథకం ద్వారా పంటల సాగుకు అయ్యే పెట్టుబడికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి పంట అమ్మకం వరకు గ్రామాల్లోనే రైతులకు సేవలు అందిస్తోందని వివరించారు. ఈ క్రాప్‌ నమోదు చేసుకున్న రైతులకు పంట రుణాలు, బీమా రిజిస్ట్రేషన్‌, పంట నష్టపోతే పరిహారం అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఏ సీజన్‌లో పంట నష్టపోతే ఆ సీజన్‌లోనే పరిహారం అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదని పేర్కొన్నారు. వ్యవసాయంలో ఆధునిక యంత్రాల కొరతను నివారించేలా వైఎస్సార్‌ యంత్రసేవా పథకం ద్వారా రైతులకు అవసరమైన యంత్ర పరికరాలను సమకూరుస్తున్నట్లు వెలంపల్లి తెలిపారు. తొలుత రైతు సాధికార సంస్థ, ప్రకృతి వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్‌ను జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. ఈ కార్యక్ర మంలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు తోలేటి శ్రీకాంత్‌, ఎం.శివరామకృష్ణ, జిల్లా వ్యవసాయాధికారి నాగ మణెమ్మ, జిల్లా ఉద్యాన శాఖ అధికారి కె.బాలాజీ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement