నాట్స్ ఆధ్వర్యంలో ఫ్లోరిడా, టెంపాబేలో వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు

VolleyBall Tournaments Conducted By NITS And Tamil Sneha In Florida - Sakshi

ఫ్లోరిడా(టెంపాబే): ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్, తమిళ స్నేహమ్స్‌లు సంయుక్తంగా పురుషుల వాలీబాల్, మహిళల త్రోబాల్ టోర్నమెంట్లు నిర్వహించాయి. అంకుల్ జే జ్ఞాపకార్థకంగా నాట్స్.  స్నేహమ్స్‌ ఫ్లోరిడాలో ఈ టోర్నమెంట్‌ జరిగింది.

ఫ్లోరిడాలోని ఓర్లాండో, టాంపా బేలోని జాక్సన్ విల్లేకు చెందిన 22 జట్లు ఈ టోర్నమెంటుల్లో పాల్గొన్నాయి.  250 మందికి పైగా క్రీడాకారులు పోటీ పడ్డారు. రచ్చ, టెంపాబే జట్టు  పురుషుల వాలీబాల్ కప్ ను గెలుచుకుంది. ఎంఎస్ కె, ఓర్లాండో జట్టు రన్నరప్‌గా నిలిచింది. సన్ షైనర్స్, టెంపాబే జట్టు మహిళల త్రోబాల్ టోర్నమెంట్ విజేతగా నిలిచింది.  ఎంఏసీఎఫ్‌ వారియర్స్ రన్నరప్ గా నిలిచింది. టోర్నమెంట్ లో విజేతలకు ట్రోఫీలు, పతకాలు అందించారు. 

ఈ టోర్నమెంట్స్ విజయవంతం కావడానికి నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ నాట్స్ బోర్డు కార్యదర్శి ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్/మార్కెటింగ్) శ్రీనివాస్ మల్లాది, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ కాండ్రు, నాట్స్ ఎగ్జిక్యూటివ్ వెబ్ సెక్రటరీ సుధీర్ మిక్కిలినేని, నాట్స్ టెంపాబే చాప్టర్ కో ఆర్డినేటర్, ఐటిసర్వ్ అలయన్స్ టెక్నాలజీ చైర్ ప్రసాద్ ఆరికట్ల, ఐటిసర్వ్ అలయన్స్, ఫ్లోరిడా చాప్టర్ ప్రెసిడెంట్ భరత్ మూల్పూరు,  జాయింట్ కో ఆర్డినేటర్ సురేష్ బొజ్జా తదితరులు కీలక పాత్ర పోషించారు. తమిళ స్నేహం ఎగ్జిక్యూటివ్ కమిటీ దేవా అన్బు ఈ టోర్నమెంట్‌కు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


నాట్స్ టెంపాబే  సహకారంతో జరిగిన ఈ టోర్నమెంట్లకు మద్దతు అందించిన నాట్స్ బోర్డు ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ అధ్యక్షుడు విజయ్ శేఖర్ అన్నే, నాట్స్ నాయకులు రవి గుమ్మడిపూడి, శ్రీనివాస్ కాకుమాను,రంజిత్ చాగంటి, మురళీ మేడిచెర్ల తదితరులకు నాట్స్ టెంపా బే విభాగం కృతజ్ఞతలు తెలిపింది. రూరి స్టాప్ట్‌వేర్ టెక్నాలజీస్, ఐటీ సర్వీస్ అలయన్స్ ఫ్లోరిడా, సహకారంతో నాట్స్ టెంపాబే విభాగం ఈ టోర్నమెంట్‌కు తమ వంతు సహకారాన్ని, మద్దతును అందించాయి. ఈ పోటీల నిర్వహాణలో నాట్స్ ఇచ్చిన మద్దతు మరువలేనిదని తమిళ స్నేహం ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రశంసించింది. 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top