breaking news
volley ball tournnment
-
నాట్స్ ఆధ్వర్యంలో ఫ్లోరిడా, టెంపాబేలో వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు
ఫ్లోరిడా(టెంపాబే): ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్, తమిళ స్నేహమ్స్లు సంయుక్తంగా పురుషుల వాలీబాల్, మహిళల త్రోబాల్ టోర్నమెంట్లు నిర్వహించాయి. అంకుల్ జే జ్ఞాపకార్థకంగా నాట్స్. స్నేహమ్స్ ఫ్లోరిడాలో ఈ టోర్నమెంట్ జరిగింది. ఫ్లోరిడాలోని ఓర్లాండో, టాంపా బేలోని జాక్సన్ విల్లేకు చెందిన 22 జట్లు ఈ టోర్నమెంటుల్లో పాల్గొన్నాయి. 250 మందికి పైగా క్రీడాకారులు పోటీ పడ్డారు. రచ్చ, టెంపాబే జట్టు పురుషుల వాలీబాల్ కప్ ను గెలుచుకుంది. ఎంఎస్ కె, ఓర్లాండో జట్టు రన్నరప్‌గా నిలిచింది. సన్ షైనర్స్, టెంపాబే జట్టు మహిళల త్రోబాల్ టోర్నమెంట్ విజేతగా నిలిచింది. ఎంఏసీఎఫ్ వారియర్స్ రన్నరప్ గా నిలిచింది. టోర్నమెంట్ లో విజేతలకు ట్రోఫీలు, పతకాలు అందించారు. ఈ టోర్నమెంట్స్ విజయవంతం కావడానికి నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ నాట్స్ బోర్డు కార్యదర్శి ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్/మార్కెటింగ్) శ్రీనివాస్ మల్లాది, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ కాండ్రు, నాట్స్ ఎగ్జిక్యూటివ్ వెబ్ సెక్రటరీ సుధీర్ మిక్కిలినేని, నాట్స్ టెంపాబే చాప్టర్ కో ఆర్డినేటర్, ఐటిసర్వ్ అలయన్స్ టెక్నాలజీ చైర్ ప్రసాద్ ఆరికట్ల, ఐటిసర్వ్ అలయన్స్, ఫ్లోరిడా చాప్టర్ ప్రెసిడెంట్ భరత్ మూల్పూరు, జాయింట్ కో ఆర్డినేటర్ సురేష్ బొజ్జా తదితరులు కీలక పాత్ర పోషించారు. తమిళ స్నేహం ఎగ్జిక్యూటివ్ కమిటీ దేవా అన్బు ఈ టోర్నమెంట్‌కు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాట్స్ టెంపాబే సహకారంతో జరిగిన ఈ టోర్నమెంట్లకు మద్దతు అందించిన నాట్స్ బోర్డు ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ అధ్యక్షుడు విజయ్ శేఖర్ అన్నే, నాట్స్ నాయకులు రవి గుమ్మడిపూడి, శ్రీనివాస్ కాకుమాను,రంజిత్ చాగంటి, మురళీ మేడిచెర్ల తదితరులకు నాట్స్ టెంపా బే విభాగం కృతజ్ఞతలు తెలిపింది. రూరి స్టాప్ట్‌వేర్ టెక్నాలజీస్, ఐటీ సర్వీస్ అలయన్స్ ఫ్లోరిడా, సహకారంతో నాట్స్ టెంపాబే విభాగం ఈ టోర్నమెంట్‌కు తమ వంతు సహకారాన్ని, మద్దతును అందించాయి. ఈ పోటీల నిర్వహాణలో నాట్స్ ఇచ్చిన మద్దతు మరువలేనిదని తమిళ స్నేహం ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రశంసించింది. -
ఎస్పీ కాలేజి శుభారంభం
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ విద్యాసంస్థల క్రీడల్లో భాగంగా జరిగిన వాలీబాల్ టోర్నీలో సర్ధార్ పటేల్ (ఎస్పీ) కాలేజి శుభారంభం చేసింది. విక్టరీ ప్లేగ్రౌండ్‌లో శనివారం జరిగిన వాలీబాల్ పోటీల్లో ఎస్పీ కాలేజి 25-12, 25-20 స్కోరుతో శ్రీవెంకటేశ్వర డిగ్రీ కాలేజిపై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో శ్రీవెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజి 18-25, 25-16, 15-13తో శ్రీలక్ష్మీనరసింహ స్వామి కాలేజి (భువనగిరి)పై గెలిచింది. మూడో మ్యాచ్‌లో ఎస్పీ కాలేజి 25-16, 25-12తో కాలేజి ఆఫ్ ఎడ్యుకేషన్ (కల్వకుర్తి)పై గెలిచింది. అంతకు ముందు ఈపోటీలను హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజేందర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ డెరైక్టర్ డాక్టర్ ఎస్.ఆర్.ప్రేమ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈక్రీడల్లో క్యారమ్, టెన్నికాయిట్, బాస్కెట్‌బాల్ క్రీడాంశాల్లో పోటీలను నిర్వహిస్తారు.